S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సివిల్ సర్వీస్‌తో జీవితకాలం సేవ చేసే అవకాశం

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 25: సివిల్ సర్వీస్ వంటి అత్యున్నతమైన పదవి ద్వారా జీవితకాలం సేవచేసే అవకాశం ఉంటుందని, పేదవారు, దళితులు, వెనుకబడిన కులాలవారు అకుంఠిత దీక్ష, ఏకాగ్రతతో సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత కావడం పట్ల వారిని తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్న వ్యక్తులను అభినందిస్తున్నామని మంత్రులు రావెల కిషోర్‌బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక ఎ కనె్వన్షన్ సెంటర్‌లో సోమవారం విజయవాడ జాయింట్ యాక్షన్ ఫోరం కమిటీ నిర్వాహకులు కొర్లపాటి విజయ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 38 మంది సివిల్ ఎగ్జామ్స్ టాపర్లకు, ఐఎఎస్‌గా దేశంలోనే ప్రథమ ర్యాంకు సాధించిన తొలి షెడ్యూల్డ్ కులాలకు చెందిన టీనాదాభికు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ సివిల్ సర్వీసులో పేదవాళ్ల అభ్యున్నతి కోసం, దేశ ప్రగతి కోసం అహర్నిశలు పనిచేయాలని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తేగాని సాధించలేని సివిల్ సర్వీస్ గెలుపును దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచేలాగా గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, నిరుపేదల ఉన్నతి కోసం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ ఏడాది 750 మందికి సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షలకు ఉత్తమమైన శిక్షణ అందించనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలియజేశారు. జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కృషి, పట్టుదల ముఖ్యమని లక్ష్యం మేరకు పనిచేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమవుతుందన్నారు. కంచికచర్ల ప్రాంతంలోని ఇద్దరు సివిల్ సర్వీస్‌లో ఉత్తీర్ణులవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని నిజం చేయడంలో దళితులు చూపుతున్న ప్రతిభ వారి కలలను నిజం చేస్తుందని మంత్రి అన్నారు. హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ అంబేద్కర్ కలలు కన్న స్వేచ్ఛ, సమానత్వం సాధించే దిశగా ఉన్నతమైన పోటీ పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలవడం ద్వారా దళితుల గొప్పతనాన్ని చాటిన టీనాదాభి ఈ నాటి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం టీనాదాభి మాట్లాడుతూ తన జీవితంలో ఈ పౌర సన్మానాన్ని మరచిపోలేనని, విజయవాడ నగరాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని ఈ సన్మానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఐఎఎస్ చదవాలని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనే తన తల్లిదండ్రులు ప్రోత్సహించారని, డాక్టర్ కావాలని సైన్స్‌గ్రూపులో చేరిన తను 3 నెలల అనంతరం ఆర్ట్ గ్రూప్‌కు మారి సామాజిక స్పృహతో కూడిన అంశాలను చదవడంతో ఐఎఎస్ సాధించగలిగానన్నారు. సివిల్ సర్వీస్‌లో విజేత అవ్వాలంటే మూడు విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తెరగాలన్నారు. కష్టపడే తత్వం, ప్రణాళిక, ఓపిక ముఖ్యమైనవని ఆమె పేర్కొన్నారు.