S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆస్తి తగాదా కేసులు కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలి

ఏలూరు, జూలై 25 : ఆస్తి తగాదా కేసులు కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలే తప్ప మీ-కోసం కార్యక్రమంలో పరిష్కరించడం కుదరదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం మీ-కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు కావాలంటూ ఎవరూ మీ-కోసంలో దరఖాస్తులు చేయవద్దని పేర్కొన్నారు. దువ్వ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని పలువురు కోరగా కలెక్టర్ స్పందిస్తూ దువ్వ గ్రామంలో 20 సెంట్ల భూమి సేకరించి 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, త్వరలో ప్రభుత్వాసుపత్రిని ఏర్పాటుచేయాలని డిసిహెచ్ ఎస్‌ను ఆదేశించారే. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో భాగంగా గత మే 17వ తేదీన గ్రేడ్ లైబ్రేరియన్‌గా నియమించినప్పటికీ ఉద్యోగంలో జాయిన్ చేసుకోవడం లేదని ఉండ్రాజవరం మండలం తాడిపర్రుకు చెందిన జిడివి అయ్యప్పస్వామి ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ గ్రంధాలయ సంస్థ కార్యదర్శిని పిలిపించి అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇప్పించి జాయినింగ్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. పెదవేగి మండలం తాళ్లగోపవరానికి ఏలూరు నుంచి బస్సును పునరుద్ధరించాలని విద్యార్ధి సంఘ నాయకులు కోరగా వెంటనే చర్యలు చేపట్టాలని ఆర్‌టిసి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, డిపివో కె సుధాకర్, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, డి ఎస్‌వో శివశంకర్‌రెడ్డి, భూసేకరణ ఎస్‌డిసి ఆర్‌వి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.