S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాకాని దర్గా వద్ద ఉద్రిక్తత

గుంటూరు, జూలై 25: పెదకాకాని బాజీబాబా దర్గా వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.. దర్గా ప్రాంగణంలో అన్యమత ప్రచారం నిర్వహిస్తున్నారనే అభియోగంతో భక్తులు, స్థానికంగా నీటిపారుదలశాఖ స్థలాల ఆక్రమణదారుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తోంది. గత కొద్ది నెలల క్రితం వరకు దర్గాను వక్ఫ్‌బోర్డు అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన ఉరుసు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు రోడ్లు, ఇతర వౌలిక సదుపాయాలు.. భక్తుల భద్రత కోసం సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు దర్గా ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఓ సంస్థ దర్గా సమీపంలోని కాలనీలో నివసిస్తున్న వారిని ప్రేరేపిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భక్తులు పోలీసు అధికారులు, రాష్ట్ర వక్ఫ్, మైనారిటీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపారు. పవిత్రమైన దర్గా స్థలంలో అన్యమత ప్రచారం చేస్తున్నారని వివరించారు. దర్గా పరిసరాలు భక్తుల సౌకర్యానికే వినియోగించుకోవాల్సి ఉండగా యధేచ్చగా చెరువు స్థలాన్ని ఆక్రమించుకోవడంతో పాటు దర్గాకు వచ్చే భక్తులను చేరదీసి మతమార్పిడిని ప్రోత్సహిస్తున్నారని, అదేమని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులతో బెదిరిస్తున్నారని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు పరస్పర ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.