S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వనం - మనంలో కోటి మొక్కలు నాటాలి

గుంటూరు, జూలై 25: హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఈనెల 29వ తేదీన రాష్టవ్య్రాప్తంగా కోటి మొ క్కలు నాటడం ద్వారా వనం-మనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేష్ పేర్కొన్నారు. సో మవారం ఆయన హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో 13 జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. వనం-మనం కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంధ సంస్థలు, అధికారులు, ప్రజలు భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిగా చేపట్టాలని ఇందులో భాగంగానే వనం -మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పాఠశాలలు, కళాశాలలు వి శ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, ఆధ్యాత్మిక కేంద్రాలు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటడానికి అనువైన స్థలాలను గుర్తించి అందుకు తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. కేవలం 29వ తేదీ మాత్రమే కాకుండా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగేలా చూడాలని కోరారు. మొక్క నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా సంబంధిత వర్గాల వారికి అప్పజెప్పాలని సూచించారు. నాటిన మొక్క చుట్టూ కంచె ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సాధ్యమైనంత మంది భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు వనం-మనం కార్యక్రమంపై వ్యాసరచన, పెయింటింగ్ తదితర అంశాలపై పోటీలను నిర్వహించాలని కోరారు. జిల్లా నుండి కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 11,31,000 మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇందుకు గాను 1300 స్థలాలు గుర్తించామని, కార్యక్రమ విజయవంతానికి ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో గుంటూరు నుంచి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి, అటవీశాఖ అధికారి రామ్మోహనరావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.