S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాజకీయ పార్టీలకు స్థలాలపై రాద్ధాంతం తగదు

గుంటూరు (కొత్తపేట), జూలై 25: రాష్ట్రప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీల కోసం స్థలం కేటాయింపుల విషయంలో విధివిధానాలు రూపొందిస్తుందని, తదనుగుణంగానే స్థలాలు కేటాయించడం జరుగుతుందని, దీనిపై వైసిపి అనవసర రాద్ధాంతాలు చేయడం తగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం అరండల్‌పేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రాజకీయ పార్టీలకు ఎంతస్థలం కేటాయించాలన్నదానిపై 344వ జీవోను విడుదల చేసింది. పార్టీల స్థాయిలను బట్టి స్థలం కేటాయింపులు జరుగుతాయన్నారు. ఢిల్లీలో నేటికీ తెలుగుదేశం పార్టీ కోసం స్థలం కేటాయించలేదని, స్థలం కేటాయింపుల్లో ఆయా రాష్ట్రాలు తమ మార్గదర్శకాలను అమలు చేస్తాయన్నారు. స్విస్‌ఛాలెంజ్ కింద సుప్రింకోర్టు గైడెన్స్ ప్రకారంగానే పనులు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ రాష్ట్ర నాలెడ్జి సెంటర్ కో-ఆర్డినేటర్ గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే 400 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు కేంద్రం అనుమతులు ఇచ్చిందన్నారు. రాజధాని మీద వ్యతిరేకతతో జగన్ స్విస్‌ఛాలెంజ్‌పై అపోహలు సృష్టిస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో రాజధాని రావడం జగన్‌కు ఇష్టంలేదని, ఇక్కడి భూముల ధరలు పెరగడం, ఉద్యోగాలు వస్తే ఆయన భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్న భయంతోనే రాజధానిపై విషంకక్కుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించాల్సింది పోయి ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.