S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

నెల్లిమర్ల, జూలై 25: ప్రజా సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పా లక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. మండలంలోని బుచ్చన్నపేట, పె ద్దతరిపి గ్రామాలలో సోమవారం గడపగడపకూ వైకాపా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంబశివరా జు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికలలో టిడిపి ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగులకు భృతి, ఇంటికో ఉద్యోగం హామీలు నేటికీ నెరవేర్చలేదని విమర్శించారు. డ్వాక్రా సంఘాల రుణం పూర్తిగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి సంఘానికి పదివేలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని చెప్పారు. ప్రస్తుతం నీరు-చెట్టు కార్యక్రమంలో టిడిపి నాయకులు అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ గృహకల్ప పథకానికి సవాలక్ష నిబంధనలు పెట్టి లబ్ధిదారులను ఇ బ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రజాబ్యాలెట్ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్జి పెనుమత్స సురేష్‌బాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, కె.వి.సూర్యనారాయణరాజు, యడ్ల గోవింద, రేగాన శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రూ. 3.50 కోట్లతో రామతీర్థంలో రింగ్‌రోడ్డు
నెల్లిమర్ల, జూలై 25: రామతీర్థం బోడికొండ పక్క నుంచి రింగ్‌రోడ్డు నిర్మాణానికి 3.50కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు ఆర్ అండ్ బి డిఇ ఫణీశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా రామతీర్థంలో ఇఓ బాబురావుతో రహదారి నిర్మాణ ంపై సోమవారం చర్చించారు. డిఇ మాట్లాడుతూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి ఎకరాల భూమి అవసరమని, స్థల సేకరణ నిమిత్తం మొదటిదశగా 70 లక్షల రూ పాయల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ఆరు ఎకరాలలో గ్రామకంఠం, జిరాయితీ, దేవస్థానం భూమి ఉన్నట్లు చెప్పారు. కిలోమీటరు మేర ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ద్వారపూడి-నందాం రహదారి విస్తరణకు తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. విజయనగరం-నరవ రహదారి విస్తరణకు ఐదు కోట్ల రూపాయలు విడుదలైనట్లు చెప్పారు. నెల్లిమర్ల రణస్థలం డబుల్‌రోడ్డు నిర్మాణానికి ఐదు కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అంబ టిసత్రం-కొత్తపేట నీళ్ల ట్యాంక్ రహదారి విస్తరణకు నాలుగు కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.