S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పర్యాటక శోభ లేనట్టే...

శ్రీకాకుళం, జూలై 25: రాష్ట్ర విభజన తర్వాత చట్టంలో జిల్లాకు పది ప్రాజెక్టులు రావల్సివుందంటూ విభజన సమయంలో అధికారంలో గల కాంగ్రెస్ ప్రభుత్వం, వేర్పాటైన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం ప్రభుత్వం సిక్కోల్ ప్రజలను మభ్యపెడుతున్నాయి. పది ప్రాజెక్టులు జిల్లాకు విభజన చట్టం మేరకు వస్తాయన్న ఆశలన్నీ ఆవిరైపోతున్న నేపథ్యంలో విశాలమైన సముద్రతీరం కలిగిన శ్రీకాకుళానికి పర్యాటక శోభ వస్తుందన్న ఆశలు నీరుగారిపోయేలా కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రాజెక్టులు కాకినాడ, నెల్లూరు జిల్లాలకు కేటాయించింది. దీంతో పదులు కాదు వందల కోట్లు పెట్టుబడులు సిక్కోల్ తీరానికి రాకుండాపోయాయి. విభజన అనంతరం తెలుగురాష్ట్రాల అభివృద్ధికి పర్యాటకరంగం ఎంతో దోహదపడుతోందని రూ. 2,047.77 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఇందులో తొలి విడతగా 402.82 కోట్ల రూ.లు విడుదల చేశారు. ఎ.పి.కి 130.21 కోట్ల రూ.లు విలువైన ప్రాజెక్టులు మంజూరు చేసి తొలి విడత కింది 26.04 కోట్ల రూ.లు కేంద్రం విడుదల చేసింది. జిల్లాలో 11 మండలాలు, 193 కి.మీటర్ల పొడవునా సముద్రతీరం, సుమారు 12 వేల మత్స్యకారుల గడప, ఎనిమిది వేల మంది నిరుద్యోగ యువతకు ఆధారంగా ప్రాజెక్టులు మంజూరవుతాయంటూ ఇక్కడ అధికార పార్టీ నేతలు, జిల్లా ఉన్నతాధికారులు చెప్పే మాటలన్నీ శుష్కవాడ్దానాలు.. శూన్యహస్తాలుగా మారిపోయాయి! పర్యాటకరంగానికి తగిన ప్రోత్సాహం ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వదేశ్‌దర్శన్ పథకంలో భాగంగా జిల్లాకు రావల్సిన ఈ ప్రాజెక్టు నెల్లూరు జిల్లాకు తరలిపోవడంతో ఎ.పి.లో కాకినాడ హోప్‌ఐలాండ్ - కోనసీమను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 13 థీమ్ సర్క్యుట్లను కేంద్రం ఎంపిక చేసింది. అలాగే, పొట్టి శ్రీరాములలు నెల్లూరు జిల్లాలోని కోస్తా ప్రాంతాలను ప్రపంచ స్థాయి కోస్తాతీర ఏకో టూరిజం సర్క్యుట్‌గా అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో శ్రీకాకుళానికి పర్యాటక శోభ లేకుండాపోయింది. ఆరుమాసాలుగా అధికారులు తయారుచేసిన నివేదికలు, ప్రాథమిక అంచనాలు, సుందరమైన బీచ్ రిసోర్ట్సు, పర్యాటక కేంద్రాలు ఇవన్నీ కేంద్రం పరిశీలనలో మరుగునపడిపోయాయి. విభజన చట్టం ద్వారా రావల్సిన పరిశ్రమలు ఏ ఒక్కటీ ఇంతవరకూ గ్రౌండ్‌వర్క్ కూడా జరగలేదు. స్థల పరిశీలనలు, చైనా, సింగపూర్, మలేషియా దేశాల ప్రతినిధులు జిల్లాకు ప్రతీ మాసంలో వస్తుండం.. వెళ్తుండం జరుగుతునేవుంది. కానీ, సుస్పష్టంగా ఫలానా ప్రాజెక్టు కోసం పెట్టుబడులు పెడతామంటూ భరోసా ఇచ్చే దాఖలాలు ఇంతవరకూ లేవు.
పోలాకి మండలంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు, 1992 నుంచి కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో గల అణువిద్యుత్ ప్రాజెక్టు, భావనపాడు పోర్టు తప్ప మరో ఊసే సిక్కోల్‌లో లేదు! ఇటువంటి తరుణంలో వందలాది కోట్ల రూపాయల పర్యాటక ప్రాజెక్టు ఇక్కడ ప్రజలకు ఊతం ఇస్తోందన్న ఆశలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీళ్ళుజల్లాయి! జిల్లాకు కేటాయించాల్సిన పర్యాటర ప్రాజెక్టు నెల్లూరు జిల్లాకు తరలించడంతో జిల్లా ప్రజలంతా ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరుపై గుర్రుగా ఉన్నారు. రానున్న కాలంలో అధికార పార్టీకి 80 శాతం నుంచి శతశాతం అనుకూలంగా ప్రజలు ఉండేలా పనులు చేయాలంటూ ముఖ్యమంత్రి పదేసార్లు సమావేశాల్లో, సభల్లో, ప్రత్యేక ప్రసంగాల్లో, చివరికి ఒన్ టూ ఒన్ ఎమ్మెల్యేలతో చెప్పే మాటలకు..చేతలకు పొంతనలేకుండా శ్రీకాకుళం జిల్లాలో పాలన సాగుతుందనడానికి సిక్కోల్ పర్యాటకరంగ ప్రాజెక్టు నెల్లూరుకి తరలిపోవడమే వారి అసమర్థపాలనకు తార్కణమంటూ రాజకీయ విశే్లషకులు విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా విభజన చట్టంలో పొందుపర్చిన పది ప్రాజెక్టుల్లో ఒక్కటైనా ఇక్కడ ప్రజలను, యువతను ఆదుకుంటుందనుకున్న పర్యాటకరంగం ప్రాజెక్టు సైతం చేజారిపోవడం జిల్లాకు పట్టిన దురదృష్టంగా ఆవేదన చెందుతున్నారు.