S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వసతిగృహ పీజీ విద్యార్థులకు కార్డులు

ఎచ్చెర్ల, జూలై 25: వసతిగృహాల్లో ఉంటూ పీజి కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు కార్డులు జారీ చేస్తున్నామని, వీటిలో రోజువారీగా అల్పాహారం, భోజనం వివరాలను నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని అంబేద్కర్ వర్శిటీ ఇంచార్జ్ వీసి ఎం.చంద్రయ్య స్పష్టంచేశారు. సోమవారం ఆయన ఛాంబర్‌లో చీఫ్ వార్డెన్ బి.అడ్డయ్య, వార్డెన్‌లు ఎం.సంజీవయ్య, కార్యజ్యోత్స్న, మేనేజర్ రాఘవరెడ్డితో వసతిగృహాల్లో పరిష్కరించాల్సిన సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గదుల కేటాయింపు పట్ల అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. అతిథులకు భోజనం ఏర్పాటు చేసి సంబంధిత విద్యార్థి అకౌంట్‌లో జమ చేయాలన్నారు. అన్ని గదుల్లో డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసి మరింత పరిశుభ్రత పాటించాలన్నారు. జారీ చేసిన కార్డులు కార్డుల ప్రక్రియ వలన నెల రోజుల్లో ఎంత మొత్తం బిల్లు వస్తుందన్న విషయాన్ని సులువుగా తెలుసుకొని తద్వారా ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుందన్నారు. సరుకుల ధరల వివరాలను కూడా విద్యార్థులకు తెలియజేయాలని స్పష్టంచేశారు. ప్రతీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ విద్యార్థిని ఆహార సలహా కమిటీ సభ్యునిగా నియమించడమే కాకుండా వారికి అక్కడ పరిస్థితులను కూడా తెలియజేసి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. విద్యార్థులు గత మార్చి, ఏప్రిల్ నెల బిల్లులకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలని కోరారని చీఫ్ వార్డెన్ వీసి దృష్టికి తెలియజేయగా తక్షణమే విద్యార్థులకు సమాచారం అందించి మరింత పారదర్శకత పాటించాలని ఆయన కోరారు.

టిడిపిది ప్రజావ్యతిరేక పాలన!
శ్రీకాకుళం(టౌన్), జూలై 25: జిల్లా వ్యాప్తంగా ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా అధికార పక్షం పాలనపట్ల గ్రామీణులు చెందుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 8వ తేదీన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం ప్రారంభమైన నాటినుండి ప్రజల ఆవేదన, ఆందోళనతో చలించిపోతున్నామన్నారు. ఏ ఒక్క ఇంటికి వెళ్లినా తెలుగుదేశం ప్రభుత్వం తీరును ఎండగడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తిట్టిపోస్తున్నారని అన్నారు. ఉపాధిలేక యువత పెడదోవలు పడుతున్నారని, రుణమాఫీ అని చెప్పి ప్రస్తుత ఖరీఫ్‌కు రుణం లేకుండా టిడిపి ప్రభుత్వం చేసిందని ప్రజలు తమ వద్ద గోడువెల్లబోసుకుంటుంటే చాలా బాధకలుగుతుందన్నారు. 70 ఏళ్లు నిండిన వారికి కూడా పింఛను తీసేస్తున్నారని, రేషన్ కార్డులు రద్దుచేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ప్రజా సాధికార సర్వే పేరుతో నిరుపేదల ఇంటికి వెళ్లి, కనీసం తినడానికి తిండిగింజలు లేని వారిని సైతం ఎంత సంపాదిస్తున్నావు, ఆదాయపు పన్ను కడుతున్నావా అంటూ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అలాగే రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమని, దీనిపై అధికార పక్షం మాట్లాడకపోవడం వలనే కేంద్ర ప్రభుత్వం ధీమాగా ఉందని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో పొన్నాడ రుషి, నల్లబారిక శ్రీనివాసరావు, పి.విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.