S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వసతిగృహాల్లో మంచినీటి సదుపాయం కల్పించండి

శ్రీకాకుళం(టౌన్), జూలై 25: నగరంలోని జెడ్పీ ఎదురుగా ఉన్న ఎస్సీ బాలికల వసతిగృహం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, కనీసం మంచినీటి సదుపాయం లేదని సుమారు డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న 50 మంది బాలికలు జిల్లా పిర్యాదుల విభాగంలో వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ ఫిర్యాదుల విభాగంలో జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావు వినతులు స్వీకరించారు. రాజాం మండలం నుండి శెట్టి ఆదిలక్ష్మి తనకు ఇంటిస్థలం మంజూరు చేయాలని కోరారు. నగరంలో ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో 4, 5 తరగతులు చదువుతున్న తమ పిల్లలను వేరే పాఠశాలలో జాయిన్ చేయటానికి టిసి ఇవ్వడం లేదని ప్రియ విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. కొత్తూరు మండలం కర్లెమ్మ గ్రామానికి చెందిన కనపాకల రామారావు 2.11 ఎకరాల భూమికి పాసుపుస్తకం, టైటిల్ డీడ్ మంజూరు చేయాలని కోరారు. హుదూద్ తుఫానులో ఇళ్లు కోల్పోయిన తనకు ఐఎవై కింద ఇళ్లు మంజూరు చేయాలని సంతబొమ్మాళి మండలం సంధిపేట నుండి బొంగు శంకరరావు వినతిపత్రం అందజేశారు. హిరమండలం మండలం దుగ్గిపురం గ్రామానికి చెందిన కె.కమలమ్య తనకు రుణమాఫీ కింద రెండో ప్యాకేజీ 53,000 రూ.లు మంజూరు చేసారని, అయితే మొదటి ప్యాకేజీ 73,000 రూ.లు మంజూరు కాలేదని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి రామ్మోహనరావు, డిఎంహెచ్‌వో ప్రతినిధి అప్పారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.