S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజా వినతులకు తక్షణ పరిష్కారం

శ్రీకాకుళం(టౌన్), జూలై 25: జిల్లా ఫిర్యాదుల విభాగం, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చే ప్రజా వినతులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావు ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో బాగంగా ఫోన్‌లో ఆయన వినతులు స్వీకరించారు.
నందిగాం మండలం సింగుపురం గ్రామం నుండి వై.కేశవరావు ఫోన్‌చేసి నీరు-చెట్టు కార్యక్రమంలో పెద్ద చెరువుట్యాంకు ర్యాంపు తొలగించాలని కోరారు. మందస మండలం హరిపురం గ్రామం నుండి జి.వెంకటరావు ఫోన్‌చేస్తూ తెలుగు పండిట్‌గా జెడ్పీ స్కూల్‌లో తనను నియమించాలని తెలిపారు. జి.సిగడాం మండలం టి.దుగ్గివలస గ్రామం నుండి ఎస్.గోపాలనాయుడు ఫోన్‌చేస్తూ తమ గ్రామంలో విద్యుత్ పూర్తిస్థాయిలో సప్లై కావడం లేదని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కంచిలి మండలం కేసరిపడ గ్రామం నుండి ఐ.కృష్ణారావు ఫోన్‌చేసి బి.శ్రీను ఎస్‌జిటిగా ఎంపిపి స్కూల్ నుండి బదిలీ అయినా ఆయన ఎక్కడా జాయిన్ కాలేదని చర్యలు తీసుకోవాలన్నారు.
నగరంలోని ఎపిహెచ్‌బి కాలనీ నుండి కె.తేజేశ్వరరావు మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మించాలని కోరారు. కొత్తూరు మండలం బలద పంచాయతీకి చెందిన గ్రామ కార్యదర్శి విదులకు హాజరుకావడం లేదని రఘురాం అనే వ్యక్తి ఫోన్‌లో పిర్యాదు చేశారు.
కార్యక్రమంలో డుమా పిడి ఆర్.కూర్మనాథ్, డిఇవో డి.దేవానందరెడ్డి, ఇంచార్జి డిఎంహెచ్‌వో డాక్టర్ మెండ ప్రవీణ్, డిఎస్‌వో వి.సుభ్రహ్మణ్యం, వ్యవసాయ శాఖ జెడి రామారావు తదితరులు పాల్గొన్నారు.