S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరిశ్రమల మూత!

విశాఖపట్నం, జూలై 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానల వలనే దేశంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని సిఐటియు అఖిల భారత కార్యదర్శి స్వదేశ్ దేవారాయ్ ఆందోళన వ్యక్తంచేశారు.విశాఖ సిఐటియు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, యాజమాన్యాల వైఖరితోనే పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. తప్పితే కార్మికులకు ఎటువంటి సంబంధంలేదని,వీరి వలనే మూతపడుతున్నాయనే ప్రభుత్వ వాదనలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఏడవ కేంద్ర వేతన సవరణ కమిషన్ సిఫారసులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలకు నష్టం కలిగించేవిగా ఉన్నాయన్నారు. అందువలన సెప్టెంబర్ 2వ తేదీన సమ్మె కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యోగులకు అవసరమైందన్నారు. ఆ రోజు సమ్మెలో కార్మికులంతా పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. ఎన్‌డిఎ ప్రభు త్వం ప్రతిపాదించిన ‘మెగా స్ట్రాటిజిక్ సేల్’లో భాగంగా దేశంలో ఉన్న అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ సంస్థలన్నింటినీ అమ్మేయడానికి ప్రభుత్వం ఊరకలేస్తుందన్నారు. ప్రభుత్వరంగాన్ని ప్రైవనేటు కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతుందన్నారు. కార్మికులకు బలవంతపు పదవి విరమణలు చేసే పథకాల ద్వారా వారి ఉద్యోగ భద్రతపై దాడి జరుగుతుందన్నారు. దీనికి వ్యతిరేకంగా 12 ప్రధానమైన డిమాండ్లపై దేశవ్యాప్త సమ్మె సెప్టెంబర్ 2న నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. కేంద్రబడ్జెట్‌లో 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం దుర్మార్గ ప్రైవేటీకరణకు ప్రణాళిక వేసిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ 56,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణకు బాట వేసిందన్నారు. ప్రభుత్వరంగ పరిశ్రమల నుండి డివిడెంట్ల రూపంలో 53,883 కోట్ల రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ పరిశ్రమల నుండి 1,10,383 కోట్ల రూపాయలు వసూలు చేయాలని పథకం వేసిందన్నారు. కంపెనీల వాటాలు, ఆస్తులు అమ్మడానికి ప్రైవేటీకరించడానికి సంపూర్ణ అధికారాలు ప్రభుత్వం నీతి అయోగ్‌కు అప్పగించిందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణకు ఇపుడు కేబినెట్ ఆమోదం అవసరంలేదన్నారు. నీతి ఆయోగ్ తాజాగా 74 సిపిఎస్‌యులను మొత్తంగా అమ్మేయడానికి, సమగ్ర ప్రతిపాదనను ప్రధానమంత్రికి ఇచ్చిందన్నారు. రక్షణ, బొగ్గు, చమురు, గనులు, విద్యుత్, టెలికామ్, ఏవియేషన్ నిర్మాణం, బీమా, పెన్షన్, బ్యాంకింగ్, రైల్వే, మల్టీబ్రాండ్ రిటైల్, ఫార్మా వంటి రంగాల్లో ఇప్పటికే విదేశీ ప్రత్యేక పెట్టుబడులను ప్రభుత్వం పెంచిందన్నారు. ఇపుడు ఈ రంగాలన్నిట్లో విదేశీ పెట్టుబడులు నూరు శాతం పెంచే ప్రతిపాదన పెడుతుందని విమర్శించారు. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని, కీలకమైన రంగాల్లో రక్షణ రంగంలో విదేవీ పెట్టుబడుల వలన నష్టం వాటిల్లుతుందన్నారు. కార్మిక చట్టాలు, కేంద్ర ప్రభుత్వరంగ కార్మికుల సర్వీస్ నిబంధనలపై దాడి జరుగుతుందన్నారు. 44 కార్మిక చట్టాలను మిళితం చేసి వాటికి మార్పులు, కూర్పులు, రద్దులు సవరణలు చేసి ఐదు కార్మిక నిర్ధేశకులుగా క్రోడికరించి పార్లమెంటు ఆమోదానికి ప్రవేశపెట్టబోతున్నారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు తమ డిసిప్లేన్ అప్పీల్ రూల్స్ (సిడిఏ) సర్వీస్ రూల్స్‌లో వివిధ రకాల శిక్షలను చేర్చాలని, యాజమాన్యానికి ఏకపక్షంగా కార్మికులను బలవంతపు పదవీ విరమణ చేయించే అధికిరం ఉండేలా రూల్స్ చేర్చాలని ఆదేశిస్తుందన్నారు. ప్రభుత్వం ఈ చర్య ట్రేడ్ యూనియన్ల పోరాటాలను అణిచివేస్తుందన్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నరసింగరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నందున ప్రముఖ కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలైన బిహెచ్‌ఇఎల్, షిప్‌యార్డులకు వర్క్ ఆర్డర్లు లేకుండా పోయాయయన్నారు. అలాగే విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇపుడు పరిశ్రమల్లో ఖాళీ స్థలాలను అమ్మకాలకు సిద్ధంచేస్తుందని విమర్శించారు.