S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాహుల్ పర్యటన వాయిదా

నర్సీపట్నం,జూలై 25: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తలపెట్టిన పాదయాత్రను ఆగస్టు 17వ తేదీకి వాయిదా వేసినట్లు డిసిసి అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు తెలిపారు. ఆగస్టు 5వ తేదీన రాజ్యసభ సభ్యుడు కె.వి.పి. రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై చర్చ జరుగనున్నందున రాహుల్ పాదయాత్రను వాయిదా వేశా రన్నారు. ఈ మార్పును పార్టీనాయకులు, కార్యకర్తలు గమనించాలని కోరారు. 17వ తేదీన రాహుల్ గాంధీ పర్యటన, పాదయాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. కె.వి.పి. రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును అన్ని రాజకీయ పార్టీలు మద్దతునివ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం వలన పరిశ్రమల స్థాపనకు రాయితీలు లభిస్తాయన్నారు. రాయితీలు ఇవ్వడం వలన పెట్టుబడిదారులు ముందుకు వస్తారని తద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి , ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై వత్తిడి తేవడమే అందరి లక్ష్యం కావాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిధుల కోసం విదేశాలు తిరిగే బదులు ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఒప్పిస్తే బాగుంటుందన్నారు. మీ అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు పాటుపడాలని బాలరాజు ముఖ్యమంత్రికి సూచించారు. విశాఖ ఏజన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఇచ్చిన 97 జి. ఓ.ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.