S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అధైర్యపడొద్దు

గోపాలపట్నం, జూలై 25: వాయుసేన విమానంలో చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్ వెళుతూ గల్లంతైన ఎన్‌ఎడి ఉద్యోగుల కుటుంబాలను వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. ముందుగా 104 ఏరియా ప్రాంతంలో వున్న భూపెంధర్‌సింగ్ గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భూపేంద్రసింగ్ భార్య సంగీత, కుమారుడు అశుతోష్‌లను ఓదార్చారు. అధైర్యపడొద్దని ఆచూకి కోసం వెతుకుతున్నారని జగన్ అన్నారు. అక్కడి నుండి బుచ్చిరాజుపాలెం నమ్మి చిన్నారావు భార్య కుమారులు కుమార్తెను పరామర్శించారు. అలాగే గంట్ల శ్రీనివాసరావు భార్య ఈశరమ్మను ఓదార్చారు. నాలుగు నెలల గర్భిణి అని తెలుసుకుని తల్లడిల్లిపోయారు. ధైర్యంగా ఉండాలని అన్నారు. గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ ఎదురుగా వున్న శ్రీనివాస నగర్ ప్రాంతానికి చెందిన పాటి నాగేంద్రరావు భార్య పూర్ణిమ, తండ్రి ప్రకాశరావు తదితర కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. నాగేంద్ర భార్య పూర్ణిమవిలపిస్తుండగా అందరి కళ్ళు చమర్చాయి. కాగా అనంతరం జగన్ మాట్లాడుతూ గల్లంతయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితిని చూసి చలించిపోయానన్నారు. తమవారి కోసం ఎదురు చూస్తున్న కుటుంబాల వారి ఆశలు వమ్ముకాకుండా గల్లంతైన వారు క్షేమం గా తిరిగి రావాలని వారు కోరుకుంటున్నానన్నారు. జగన్‌తో పాటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళ విజయప్రసాద్, తైనాల విజయకుమార్, ధర్మశ్రీ, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ కార్పొరేషన్ జియ్యాని శ్రీ్ధర్, నగర వైకాపా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
విమానాశ్రయంలో స్వాగతం
అంతకు ముందు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ నుండి విమానంలో విశాఖకు చేరుకున్న జగన్‌కు విమానాశ్రయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళ విజయప్రసాద్, మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీ్ధర్, గుడివాడ అమర్‌నాథ్, కార్యకర్తలు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి నేరుగా రోడ్డు మార్గంలో గల్లంతయిన విమానంలో ఉన్న ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించడానికి తరలి వెళ్లారు.