S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారి ఇద్దరి కలయికతోనే ఆర్‌ఇసిఎస్ అభివృద్ధి

కశింకోట, జూలై 25: దివంగత మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ వుడా చైర్మన్ ఆర్‌ఇసిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ఎఎస్ అప్పలనాయుడు ఆర్‌ఇసిఎస్‌ను మొట్టమొదటి సారిగా అనకాపల్లి పరిధిలో స్థాపించగా దీనికి దివంగత మాజీ ఎమ్మెల్యే పివి రమణ అధ్యక్షుడిగా ఉండి అభివృద్ధి బాటలో నడిపించారని వారి ఇద్దరి రుణం ఎప్పటికీ ఐదు మండలాల్లో ఉన్న వినియోగదారులు తీర్చుకోలేనిదని మాజీ మంత్రి, పెందుర్తి శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి,స్థానిక ఎమ్మెల్యే పీలాగోవిందసత్యనారాయణలు పేర్కొన్నారు. స్థానిక ఆర్‌ఇసిఎస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎస్‌ఆర్‌ఎఎస్ అప్పలనాయుడు విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పీలా అధ్యక్షత న జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ అప్పలనాయుడు ఒకరోజు ట్రైన్‌లో ప్రయాణం చేస్తుండగా చీపురుపల్లికి చెందిన అక్క డి సంస్థకోసం సంభాషణ వచ్చిన సమయంలో మా ప్రాంతంలో కూడా ఇటువంటి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న పరిణామమే ఈ రోజు కోట్లాది రూపాయల లాభాలు అర్జిస్తు న్న సంస్థ కశింకోట ఆర్‌ఇసిఎస్ అని స్పష్టం చేశారు. ఈ సంస్థకు రూపకల్పన అప్పలనాయుడు చేస్తే దీనికి అధ్యక్షులు గా మునగపాక గ్రామానికి చెందిన పివి రమణ అధ్యక్షులుగా ఉండి సైకిల్‌పై తిరిగి ఎన్ని స్తంభాలు ఉన్నాయి, ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారని కఠోరమైన నిర్ణయాలతో సంస్థను లాభాల బాటలో నడిపించిన నాయకులు వారేనన్నారు. పైసా ఆశకు పోకుండా ప్రతి పైసా లెక్కించి సంస్థను అభివృద్ధి పథంలో నడపించిన వారికి ఈ ప్రాంతంలో విగ్రహాలు ఏర్పాటు చేయడం దానికి నేను ప్రారంభోత్సవానికి రావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ప్రాజెక్టుకు అప్పలనాయుడు పేరు ప్రతిపాదిస్తామని అలాగే పూడిమడక రోడ్డులో మునగపాక వెళ్లే రహదారిలో పి.వి రమణ విగ్రహం ఏర్పాటు చేస్తామని, అలాగే శారదానదిపై దివంగత ఎమ్మెల్యే కె గోవిందరావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గోవిందసత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్‌పిటిసి మలసాల ధనమ్మ, ఎంపిపి పెంటకోట సుబ్బలక్ష్మీ, అనకాపల్లి ఎంపిపి కొణతాల వెంకటసావిత్రి, పరవాడ ఎంపిపి మాసవరపు అప్పలనాయుడు, పెందుర్తి ఎంపిపి రెడ్డి వరలక్ష్మీనారాయణరావు, స్థానిక సర్పంచ్ తిరుచోళ్ల నాగేశ్వరీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరక్టర్ డి శ్రీనివాసరాజు, ప్రాజెక్టు ఇంజినీర్ జె ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.