ప్రేమోన్మాది అరెస్టు
Published Tuesday, 26 July 2016విజయనగరం: పెళ్లికి అంగీకరించలేదని బ్లేడుతో ఓ యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది విక్రమ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తనను ప్రేమిస్తూనే మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ పెళ్లికి నిరాకరించినందుకే ఆ యువతిపై దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్యాయత్నం, నిర్భయ చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.