డబ్బింగ్ సీరియల్స్‌పై మళ్లీ ఉద్యమం
Published Tuesday, 26 July 2016డబ్బింగ్ సీరియల్స్‌పై తెలుగు టెలివిజన్ యూనియన్ సీరియస్ అయింది. తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్ల జీవితాలను రోడ్డున పడేసేలా డబ్బింగ్ సీరియల్స్ దండయాత్ర చేస్తున్నాయని తెలుగు టెలివిజన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. డబ్బింగ్ సీరియల్స్‌ను అడ్డుకునేందుకు ఉద్యమానికి సిద్ధమయ్యామని తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ప్రకటించింది.
ఈ మేరకు ఫిలిం ఛాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో తెలుగు టెలివిజన్ ఆర్టిస్టుల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుల్లితెర ఆర్టిస్టుల డైరెక్టరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్టిస్టుల డైరెక్టరీ ఆవిష్కరించారు. టెలివిజన్ యూనియన్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. నిర్మాత, సుఖీభవ వెంచర్ అధినేత గురురాజ్‌ను, టీవీ ఫెడరేషన్ చైర్మన్ మేచినేని శ్రీనివాసరావును సన్మానించారు. తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు అధ్యక్షుడు వినోద్‌బాల, తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు అసోసియేషన్ సెక్రటరి విజయ్ యాదవ్, నటుడు శివాజీ రాజా, హరి, రామ్‌జగన్, నాగమణి, సుబ్బారావు, టీవీ ఆర్టిస్టులు పాల్గొన్నారు.