పుట్టినరోజు మహేష్ గిఫ్ట్
Published Tuesday, 26 July 2016ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్‌బాబు మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను ఆగస్టు 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అభిమానులకు కానుకగా ప్రీ లుక్ ప్లాన్ చేశారట. బ్రహ్మోత్సవం సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని మహేష్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. మురగదాస్ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో,కొరటాల శివతో మహేష్ కొత్త ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది. మహేష్‌కు ‘శ్రీమంతుడు’తో తిరుగులేని హిట్ ఇచ్చిన కొరటాల ఈసారి అంతకు పెద్ద హిట్ ఇచ్చే కథతో రానున్నారని సమాచారం.