జనతా గ్యారేజ్ ఆడియో 15న!
Published Tuesday, 26 July 2016ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ విడుదల తేదీ సెప్టెంబర్ 2కు వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని పాటల వేడుకను ఆగస్టు 15న విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు? ఒకవేళ ఆ రోజు కాకుంటే 14నే విడుదల చేస్తారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు హైదరాబాద్‌లో విడుదలచేసి.. ఆడియో సక్సెస్ మీట్‌ను మాత్రం వైజాగ్, తిరుపతి, విజయవాడల్లో జరపాలని ప్లాన్ చేస్తున్నారట. సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే భారీగా బిజినెస్ జరిగింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్యాచ్‌వర్క్ జరుపుకుంటూ, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటోంది.