S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాగర్‌లో ఆకుపచ్చ నీరు సరఫరా

నాగార్జునసాగర్, జూలై 26: నాగార్జునసాగర్‌లో పైలాన్, హిల్‌కాలనీ వాసులకు గత రెండురోజులుగా తాగునీటి అవసరాలకై ఆకుపచ్చ రంగులో ఉన్న నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే గతంలో పలుమార్లు తాగునీటితోపాటు తోక పురుగులు, క్రిమికీటకాలు కూడా నీటితోపాటు వస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందారు. గత రెండురోజులుగా ఆకుపచ్చ రంగుతో నీరు సరఫరా అవుతుండడంతో ఇంట్లోని కనీస అవసరాలకు సైతం ఆ నీటిని వినియోగించడానికి ప్రజలు భయపడుతున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో సంవత్సరం క్రితం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో నీటిశుద్ధిప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. అయినా కూడా చెత్తాచెదారం, కీటకాలతో కూడిన నీరు సరఫరా అవుతుండడంతో స్థానికులు చాలామంది ఫ్యూరిఫైడ్ వాటర్ పేరుతో వస్తున్న నీటిని క్యాన్‌కు రూ.10నుండి రూ.15వరకు చెల్లించి కొనుగోలు చేసి తాగుతున్నారు. ఇంటి అవసరాల నిమిత్తం డ్యాం అధికారులు సరఫరా చేస్తున్న నీటిని వినియోగిస్తున్నారు. నీటిని కొనలేని వారు అదే నీటిని వడబోసి పట్టుకోని తాగడానికి వినియోగిస్తున్నారు. ఏకంగా ఆకుపచ్చ నీరు వస్తుండడంతో ప్రజలు ఇంటి అవసరాలకు కూడా నీటిని వినియోగించడానికి ఆలోచిస్తున్నారు. అయితే ఈవిషయంలో సాగర్ డ్యాం అధికారులు మాత్రం సాగర్ జలాశయ నీటిమట్టం కనీస నీటిమట్టం కంటే కిందికి చేరుకున్న కారణంగా అడుగు భాగంలో పేరుకోని ఉన్న పాకురు పైకి రావడంతో నీరు ఆకుపచ్చరంగులో వస్తుందని ప్రజలు ఆ నీటిని వేడిచేసి చల్లారిన తరువాత ఉపయోగించాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయితే రూ.1.5కోట్ల వ్యయంతో మురుగునీటిని సైతం శుద్ధిచేసిన ప్లాంట్ ఉండగా తాగడానికి, అవసరాలకు ఉపయోగించడానికి వీలుకాకుండా నీటిని సరఫరా చేయడమేంటని స్థానికులు అధికారులపై దుమ్మెత్తిపోస్తున్నారు. అసలే వర్షాకాలం కావడంతో పలురకాల వ్యాదులతో రోగాల భారిన పడుతున్న ప్రజలు కలుషితం అయిన నీటిని వినియోగించిన కారణంగా టైఫాయిడ్, మలేరియా, విరోచనాలు, వాంతులు మొదలగు వాటి భారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు.