S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పురాతన భవనం కుప్పకూలింది

బేగంపేట, జూలై 26: నగరంలో ఇటీవల ఫిలింనగర్‌లో నిర్మా ణంలో వున్న భవనం కూలి ఇద్దరు మృతి చెందిన సంఘటన మరవక ముందే సికిందరాబాద్ మరో విషాదం నెలకొంది. గత మూడు రోజులుగా ఏదో ఒక సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ఆర్‌పి రోడ్‌లోని మోండా మార్కెట్‌లో మంగళవారం ఓ పురాతనం భవనం నానడంతో కుప్పకూలింది. ఈ సంఘటనలో షాపు యజమాని గోపాల్ మృతి చెందాడు. శిథిలాల కింది చిక్కుకుని గాయపడ్డ గోపాల్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తూండగా మృతి చెందాడు.
మార్కెట్ ఇన్స్‌పెక్టర్ మట్టయ్య కథనం ప్రకారం...శివాజీనగర్ ప్రాంతంలో నివశిస్తున్న గోపాల్ (52) తన నివాసం ముందు ఓ పాతభవనం అద్దెకు తీసుకొని ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. కుమారుడు శైలేష్ కూడా షాప్ వ్యవహారాలు చూస్తూంటాడు. 30 సంవత్సరాల నుంచి షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీవర్షం కారణంగా మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో షాప్ ఒక్కసారిగా కుప్పకూలడంతో షాప్ కౌంటర్‌లో కూర్చున్న గోపాల్ శిథిలాలో చిక్కుకుపోవడంతో స్థానిక పోలీసులు, జిహెచ్‌ఎంసి సహకారంతో అతనిని బయటకు తీసి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆయన కుమారుడు అప్పుడే బయటకు వెళ్లడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని తెలిపారు.
సంఘటన స్థలాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్
మోండా మార్కెట్‌లో కుప్పకూలిన పురాతన భవనం సంఘటన తెలుసుకున్న డిప్యూటీ మేయర్ బాబా పసియుద్దీన్ సంఘటన వివరాలను స్థానిక సికిందరాబాద్ జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ ఎసిపి శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇదివరకే ఈ భవన యజమానులకు నోటీసులు జారీచేసినట్లు ఏసిపి శ్రీనివాస్ డిప్యూటీ మేయర్‌కు వివరించారు. మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ సంఘటన స్థలానికి చేరి పరిస్థితిని ఆయా అధికారులతో సమీక్షించారు. గోపాల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు వున్నట్లు స్థానికులు తెలిపారు.