S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై విచారణ చేపట్టాలి

కెపిహెచ్‌బికాలనీ, జూలై 26: రంగారెడ్డి జిల్లా బాలానగర్ మండలంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై విచారణ చేపట్టి వాటిని పరిరక్షించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రంజిత్‌కుమార్ షైనీని ఎమ్మెల్యే గాంధీ కోరారు. శంషీగూడ గ్రామ ప్రజలతో కలిసి బాలానగర్ మండలంలోని సర్వే 57 ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ సర్వే 36, 37, 47, 55ను చూపుతూ కబ్జాలకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందచేశారు. గాంధీ మాట్లాడుతూ సర్వే 57 ప్రభుత్వ భూమిలో 4 ఎకరాల 15 గుంటల స్థలాన్ని, కొంతమంది పెద్దలు ప్రైవేట్ నెంబర్‌గా చూపుతూ లేఅవుట్లుగా చేసి రిజిస్ట్రేషన్ చేసి అమాయక ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. సర్వే 336 ప్రభుత్వ భూమిలో యథేచ్చగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఇక్కడి భూమిని కాపాడి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం మేరకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి కేటాయించేవిధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. సర్వే 57తో పాటు 336లో సర్వే నిర్వహించి సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లయితే ప్రభుత్వ భూములను పరిరక్షించవచ్చన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.