S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కరాల తర్వాత శాశ్వత పనులు

ఇంద్రకీలాద్రి, జూలై 26: కృష్ణా పుష్కరాల సందర్భంగా దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక పనులను పూర్తి చేసి ఉత్సవాలు ముగిసిన వెంటనే శాశ్వత పనులను చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి పి మాణిక్యాలరావువెల్లడించారు. మంగళవారం ఉదయం మంత్రిని కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ దుర్గగుడిలో చేసిన ఏర్పాట్లను వివరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని అమ్మవారి సన్నిధిలో సుమారు 90శాతం తాత్కాలిక పనులను పూర్తి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. శ్రీ మల్లిఖార్జున మహామండపానికి భక్తులు చేరుకునేందుకు వీలుగా ఇప్పటికే దర్గా నుండి మండపం వరకు ఉన్న అర్జున వీధిని 100 అడుగుల మేరకు వెడల్పు చేస్తున్నట్లు వివరించారు. ఎప్పటిలాగే ఈ ఉత్సవాలకు కూడా భక్తులను ఘాట్‌రోడ్ మార్గం గుండా కొండపైకి అనుమతించి దుర్గమ్మ, స్వామి దర్శనానంతరం మల్లిఖార్జున స్వామి మెట్ల మార్గం గుండా అర్జునవీధిలోకి దిగే విధంగా ఏర్పాట్లు చేసే అవకాశం ఉందన్నారు. ఇదేవిధంగా గతంలో కొండపైనున్న పరిపాలన విభాగం, వివిధ శాశ్వత భవనాలను తొలగించటంతో కొండపైనా మరింత విశాలం ఏర్పడిందన్నారు. భక్తులు ఎంతమంది వచ్చిన ప్రత్యేక క్యూమార్గం గుండా అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భక్తులు కోరికపై లడ్డూలు, పులిహార, ప్రత్యేక ప్రసాదం ముందుగానే తయారు చేయించి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మల్లిఖార్జున మహామండపానికి విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయటంతోపాటు, శిఖరం, కలశాలకు రంగులు వేయించి కృష్ణ పుష్కర మహోత్సవాలకు సిద్ధం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున నిత్యాన్నదాన పథకంలో సాధ్యమైనంత వరకు నిత్యం లక్షమంది భక్తులకు అన్నదానం ఆలోచన కూడా మదిలో ఉన్నట్లు వివరించారు. రాజధానిలో ఉన్న దుర్గగుడిని మరింతగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన పనులు పూర్తిస్థాయిలో చేసేందుకు కొంతమేరకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. తరలి వచ్చిస్తున్న కృష్ణా పుష్కర మహోత్సవాలు, వాతావరణం అనుకూలించకపోవటం, మరికొన్ని రకాలైన కారణాల వలన జాప్యం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. దుర్గగుడి ఘాట్ కంటే విఐవి పుష్కర ఘాట్ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. వివిధ దేవస్థానాలకు చెందిన అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయటంతోపాటు మిగతా శాఖల ఉద్యోగులను సమన్వయం చేసుకొని ఉత్సవాలను విజయవంతం చేయవల్సిన బాధ్యత దుర్గగుడి ఉద్యోగులపై ఉందన్నారు. తొలుత దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి మంత్రిని వెంటబెట్టుకొని జరుగుతున్న పనులను స్వయంగా చూపించారు. ఈసందర్భంగా మంత్రి పనులను పర్యవేక్షించి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఈకార్యక్రమంలో దేవస్థానం సహాయ ఇవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, వివిధ సెక్షన్‌లకు చెందిన పర్యవేక్షణాధికారులు పాల్గొన్నారు.