S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చంద్రబాబు పాలనలోనే ఉద్యోగాలు, ఉపాధి

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 26: చంద్రబాబు నాయుడు పాలనలోనే ఉద్యోగాలు, ఉపాధిని ఇతోధికంగా కల్పించడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు కల్పించడం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం ఐలాపురం కనె్వన్షన్ సెంటర్‌లో చంద్రన్న పాలన - నవ్యాంధ్రప్రదేశ్‌లో విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈసదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈసందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ఓర్వలేని జగన్ తన కర పత్రికలో జాబులపై నిజాలకు మసిపూసి నిత్యం అబద్దాలను వల్లిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు విద్యా, ఉద్యోగ ఉపాధి కల్పనకు శాస్ర్తియ దృక్పథంతో బాటలు వేస్తున్నారని తెలిపారు. నిధులు లేక విభజన గాయాలు మానని రాచపుండులా బాధిస్తున్నా ఎన్నికల హామీలను పూర్తిచేశారన్నారు. ఈకార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, కృష్ణావర్సిటీ ప్రొఫెసర్ డా. బసవేశ్వరరావు, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మం, జిల్లా అధ్యక్షులు ఎన్ నాగభూషణం, జాతీయ కమిటీ సభ్యులు రాజేష్, అరుణ్, బాజి, శివ, బాలాజి తదితరులు పాల్గొన్నారు.