S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కరాల బందోబస్తుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధం

అవనిగడ్డ, జూలై 26: కృష్ణా పుష్కరాలకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమైందని ఏలూరు రేంజ్ డిఐజి పివిఎస్ రామకృష్ణ తెలిపారు. మంగళవారం దివి డివిజన్‌లోని పుష్కర ఘాట్లలో ఏర్పాట్లను ఆయన పరిశీలించేందుకు వచ్చారు. ఈసందర్భంగా కొత్తపేటలోని పుష్కరఘాట్‌ను పరిశీలించి భద్రతపై తగిన సూచనలు చేశారు. పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో నాలుగు ఘాట్లు ఎ కేటగిరిలో ఉండగా వాటిలో రెండు అర్బన్ పరిధిలో ఉన్నాయని వివరించారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అవనిగడ్డ ఘాట్ వద్ద కృష్ణవేణి, గాంధీజీ విగ్రహాలు ఏర్పాటు చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. డిఎస్పీ సయ్యద్ ఖాదర్ బాషా, సిఐ మూర్తి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.