S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అది ద్రవ్య బిల్లు!

న్యూఢిల్లీ,జూలై 26: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేందుకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రతిపాదించిన సవరణ బిల్లు ఆర్థిక అంశాలతో కూడుకున్నది కాబట్టి ఓటింగ్ సాధ్యం కాదని రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక హోదా ఆంశంపై ప్రతిపక్ష సభ్యుల వాదనకు జైట్లీ బదులిస్తూ ఆర్థికాంశాలతో కూడుకున్న ప్రత్యేక హోదా సవరణ బిల్లుపై ఓటింగ్ జరపటం రాజ్యాంగ విరుద్ధం, ఆందుకే ఓటింగ్ జరపటం సాధ్యం కాదంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో మండిపడిన కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి గొడవ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం ఇష్టం లేదంటూ వారు ఇచ్చిన నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. కాంగ్రెస్ సభ్యులు రామచంద్రరావు, ఎంఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డితోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో రాజ్యసభను స్తంభింపజేశారు. కాంగ్రెస్ సభ్యుల గొడవ మూలంగా రాజ్యసభ మొదట రెండుసార్లు స్వల్ప వాయిదాల తర్వాత బుధవారానికి వాయిదా పడింది.
ప్రత్యేక హోదా అంశంపై మంగళవారం కొద్దిసేపు చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ పేరతో ఈ అంశాన్ని వచ్చే శుక్రవారం వరకు వాయిదా వేసేందుకు బిజెపి పన్నిన వ్యూహం కొంతవరకు ఫలించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ లేచి ప్రత్యేక హోదాపై ఈరోజు ఆరగంట పాటు చర్చ జరిపిన అనంతరం వచ్చే శుక్రవారం దీనిపై ఓటింగ్ జరుపుకోవచ్చునని ప్రతిపాదించారు. తెలుగుదేశానికి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి దీనికి మద్దతు పలికారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా బిల్లుపై చర్చ జరిపినప్పుడు తమ పార్టీ వారెవ్వరూ లేకపోవటంతో తమ అభిప్రాయాలను వెల్లడించలేకపోయామని, ఇప్పుడు తాను రాజ్యసభకు వచ్చినందున ప్రత్యేక హోదాపై చర్చ జరపాలని విజ్ఞప్తి చేశారు. అయితే కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్, సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి బిజెపి తెర వెనక వ్యూహాన్ని పసి గట్టారు. ప్రత్యేక హోదాపై ఈరోజు ఆరగంట పాటు చర్చ జరిపిన అనంతరం వచ్చే శుక్రవారం దీనిపై ఓటింగ్ జరిపే సమయంలో ప్రభుత్వం వ్యతిరేకిస్తే ఎలా? అని వారు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు సంబంధించిన సవరణ బిల్లు ఆర్థికాంశాలతో కూడుకున్నందున దీనిపై రాజ్యసభలో ఓటింగ్ జరపటం రాజ్యాంగ విరుద్ధమని జైట్లీ ప్రైవేట్ చర్చల్లో చెబుతున్నారు, పార్లమెంటు సెంట్రల్ హాలులో చెబుతున్నారని వాదించారు. దీనిపై డిప్యూటీ చైర్మన్ కురియన్ జోక్యం చేసుకుంటూ ప్రైవేట్‌గా జరిగే చర్చల గురించి ఇక్కడ ప్రస్తావించటం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ పక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ లేచి ఓటింగ్ వ్యవహారంపై తమకు స్పష్టత కావాలని పట్టుబట్టారు. ఈ సమయంలో జైట్లీ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సవరణ బిల్లు ఆర్థికాంశాలతో కూడుకున్నది కాబట్టి దీనిపై రాజ్యసభలో ఓటింగ్ జరపటం సాధ్యం కాదన్నారు.
దీనికి ఆగ్రహించిన కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకుపోయారు. కెవిపిసహా పలువురు కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిప్యూటీ స్పీకర్ కురియన్ కాంగ్రెస్ సభ్యులను శాంతింపజేసేందుకు తీవ్రంగా కృషి చేసి విఫలమయ్యారు. దీనితోఆయన సభను బుధవారానికి వాయిదా వేశారు.