S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

30వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక

అవనిగడ్డ, జూలై 26: మండల పరిధిలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా 30వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించాలని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధికారులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హరితాంధ్రప్రదేశ్‌గా రూపొందించేందుకు పర్యావరణ సమతుల్యత కోసం విధిగా మొక్కలు నాటాలన్నారు. ఇందుకు ప్రజలను చైతన్యపర్చటంలో అధికారులు కృషి చేయాలన్నారు. గతంలో చేతులారా చెట్లను పొగొట్టుకున్నామని, ఆ కారణంగానే వాతావరణంలో పెనుమార్పులు వచ్చాయన్నారు. మళ్లీ మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందుకోసం చక్కటి ప్రణాళిక రూపొందించుకోవాలని, మొక్కలు పంపిణీ చేయటమేకాక వాటి సంరక్షణ ముఖ్యం కావాలన్నారు. ప్రతి ఇంటికి ఉపయోగపడే మొక్కలు పంపిణీ చేయాలని, 30వేల మొక్కలు బతికితేనే ప్రయోజనం కలుగుతుందని, అందుకు అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. మొక్కలు పెంపకంలో ఉత్తీర్ణత సాధించిన గ్రామ పంచాయతీలకు రూ.3లక్షల నగదు బహుమతి కూడా ఇవ్వనున్నారని, ముఖ్యంగా సర్పంచ్‌లు ఇందుకోసం కృషి చేస్తే ఆదర్శ గ్రామంగా వారి పేరును చెప్పుకుంటారని పేర్కొన్నారు. ఈవిషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈసందర్భంగా గురువారం పులిగడ్డలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని బుద్ధప్రసాద్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో సాయిబాబు, జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, తహశీల్దార్ అంజనా నాయక్, విద్యాసంస్థల ప్రతినిధులు సనకా పూర్ణచంద్రరావు, లంకమ్మ ప్రసాద్, కె వెంకటేష్ పాల్గొన్నారు.