S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘ఖరీఫ్’లో చేదు అనుభవాలు ఖాయమా?

మచిలీపట్నం, జూలై 26: ప్రస్తుత ఖరీఫ్ సాగులోనూ గత చేదు అనుభవాలు తప్పేట్లు కనిపించడం లేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా డెల్టాలో ఖరీఫ్ సాగు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. అరకొరగా విడుదల చేసిన గోదావరి జలాలు రైతన్నలను ఏమాత్రం ఆదుకోలేకపోతున్నాయి. దీంతో ఖరీఫ్ సాగు సందిగ్ధంలో పడింది. తొలకరిలో పడ్డ వర్షాలకు మురిసిపోయిన రైతులు నారుమడులు పోశారు. కానీ తర్వాత నుంచి వర్షాలు దోబూచులాడటంతో తీవ్రమైన సాగునీటి సమస్య ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు రైతులు ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్నారు. మోటార్ల ద్వారా నారుమడులను రక్షించుకుని చేతిచమురు వదిలించుకున్నారు. ప్రస్తుతం నారుమడులు ఏపుగా పెరిగి నాట్లకు సిద్ధమయ్యాయి. కానీ కాలువల్లో చుక్కనీరు లేకపోవటంతో నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. ఫలితంగా నారుమడులు ముదిరి పశువులకు మేతగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. గత ఖరీఫ్ సాగులో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్న రైతులు మళ్లీ అదే పరిస్థితిని ఈ ఖరీఫ్ సీజన్‌లోనూ ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ భూములు బీడుపడే ప్రమాదం కనిపిస్తోంది. జూన్‌లో పర్వాలేదనిపించిన వర్షపాతం క్రమేణా తగ్గుముఖం పడుతోంది. లోటు వర్షపాతం నమోదైన మండలాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. జిల్లాలో జూన్ 1 నుండి జూలై 26 వరకు సరాసరి వర్షపాతం 336.3 మి.మీలుగా నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కన్నా 51.7 మి.మీలు అధికం కావడం విశేషం. కానీ జిల్లాలో 50 మండలాలు ఉండగా నాలుగు మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 23 మండలాల్లో సాధారణ వర్షపాతం, 23 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం మొహం చాటేసిన వర్షాలు ఎప్పుడెప్పుడు పడతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు. వర్షాలు పడని పక్షంలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకమేనని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గోదావరి జలాలైనా ఆదుకుంటాయా అంటే అదీ కనిపించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. తొలకరిలో పడ్డ వర్షాలపై ఆధారపడి వేసిన నారుమడులు, ఇటీవలి కాలంలో మోటార్ల కింద వేసిన నారుమడులను ఎలా రక్షించుకోవాలో తెలియక రైతన్నలు సతమతమవుతున్నారు.