S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముక్త్యాలలో ప్రారంభమైన పుష్కర సందడి

జగ్గయ్యపేట రూరల్, జూలై 26: మండలంలోని ముక్త్యాలలో 15రోజుల ముందుగానే పుష్కర సందడి నెలకొంది. సూర్యకాలమాన ప్రకారం మంగళవారం నుండే పుష్కరుడు నదిలో ప్రవేశిస్తాడని ఆ సమయంలో పుష్కర స్నానాలు మంచిదని పండితుల నిర్ణయం మేరకు బలుసుపాడు గురుధామ్ వ్యవస్థాపకులు తాత్వికులు గెంటేల వెంకట రమణ ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానం చేపట్టారు. పవిత్ర కృష్ణానది ఒడ్డునే పూజలు, పుష్కర స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30గంటల ముహూర్తంలో నది ఒడ్డున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై సద్గురు శివానందమూర్తి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వెంకట రమణ, వసంతలక్ష్మి దంపతులు పూజలు జరిపారు. అనంతరం పవిత్ర కృష్ణానది జలంతో అభిషేకాలు నిర్వహించి హారతులు పట్టారు. వెంకట రమణ కుటుంబంతో పాటు మధురై చిన్మయానంద స్వామి, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, వైకాపా రాష్ట్ర సామినేని ఉదయభాను తదితరులు ముందుగా పుష్కర స్నానాలు చేశారు. వేద పండితులు పిల్లలమర్రి నాగకృష్ణశర్మ, శివయ్య బృందం వారిచే సాంప్రదాయకంగా పుష్కర స్నానాలు ఆచరింపజేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కృష్ణా పుష్కర స్నానాలు ఆచరించారు. మహిళలు కృష్ణమ్మ తల్లికి పసుపు, కుంకుమతో పాటు జాకెట్ ముక్కలు సమర్పించుకున్నారు. నందిగామ డిఎస్‌పి వి ఉమామహేశ్వరరావు పుష్కర స్నానం చేసి వెంకట రమణ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా భక్తులకు కృష్ణా పుష్కరాల విశిష్టతను వెంకట రమణ తెలియపర్చారు. పుష్కర సమయంలో సకల దేవతలు నదిలో కొలువై ఉంటారని, అలాంటి పుణ్యఘడియల్లో స్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి పూజా ఫలం దక్కుతుందన్నారు. నది ఎప్పుడు కల్మషం లేకుండా ప్రవహిస్తుందని, అలానే మనుషులు కూడా మనస్సుల్లో ఎలాంటి కల్మషాలు పెట్టుకోకుండా పరస్పర సహకారంతో సమాజానికి మేలు చేసే విధంగా జీవించాలన్నారు. అనంతరం భవానీ ముక్తేశ్వరస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జగ్గయ్యపేట పరిసరాలతో పాటు హైదరాబాదు, వరంగల్లు, కోదాడ తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో గురు కుటుంబ సభ్యులు పుష్కర స్నానాల కోసం తరలివచ్చారు. ఈ సందర్భంగా నది వద్ద ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా పడవలు అడ్డం పెట్టి కృష్ణా స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు, రావిరాలకు చెందిన భక్తులు గజ ఈతగాళ్లతో భద్రతా ఏర్పాట్లు చేశారు. పుష్కరాల ప్రత్యేక డిఎస్‌పి వెంకట రమణ, జగ్గయ్యపేట సిఐ లచ్చునాయుడు, చిల్లకల్లు ఎస్‌ఐ వంశీకృష్ణ, అదనపు ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. పుష్కర స్నానాలు చేసిన వారందరికీ శివానంద ట్రస్ట్ వారు భోజనాలు ఏర్పాటు చేశారు.