S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మెగా ఆక్వాఫుడ్ పార్కుపై ప్రత్యేక కమిటీ

భీమవరం, నరసాపురం, జూలై 26: భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్కు నిర్మాణంపై పలు సందేహాలను నివృత్తి చేసేందుకు భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేశాయ. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామపెద్దలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నరసాపురం సబ్ కలెక్టర్ ఎఎస్ దినేష్‌కుమార్ మంగళవారం ప్రకటించారు. సబ్‌కలెక్టర్ దినేష్‌కుమార్, నరసాపురం డిఎస్పీ జి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో గ్రామపెద్దలతో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కును భారతప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా భీమవరం పట్టణానికి చెందిన ఆనంద గ్రూపు సంస్థ యాజమాన్యాన్ని ప్రమోటర్‌గా నిర్మించ తలపెట్టిందన్నారు. ఆక్వాపార్కు వల్ల చుట్టుపక్కల ఆక్వా రైతులకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కోల్డ్ స్టోరేజ్, ప్రొసెసింగ్ ప్లాంటు మాత్రమే ఫుడ్‌పార్కు యాజమాన్యం కేటాయించిన సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే వీటిని నిర్మిస్తారన్నారు. ఇందులో ఏ విధమైన తయారీ ఉండదని, దీని నుంచి వచ్చే వ్యర్థపదార్థాల వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లదని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కులో రోజుకు ఉపయోగించే నీటి వినియోగం కేవలం ఒక ఎకరం పొలానికి ఉపయోగించే నీరు కూడా ఉండదన్నారు. ఫుడ్‌పార్కు పరిసరాల ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు, గొంతేరు వంటి డ్రైయిన్లకు, వాటి పరివాహక ప్రాంతానికి ఎటువంటి హనీ, కాలుష్యం ఉండదని సబ్ కలెక్టర్ పునరుద్ఘాటించారు. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు ఏర్పాటుకు ముందే భారత ప్రభుత్వ అనుమతితో కాలుష్య నియంత్రణ మండలి ఇక్కడకు వచ్చి తనిఖీ చేసి, తరువాతే అనుమతి ఇచ్చిందన్నారు. దీనివల్ల ప్రజలు పడుతున్న భయభ్రాంతులు విస్మరించాలని సబ్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రైతాంగానికి జరిగే లాభాలను, నిరుద్యోగ యువతి, యువకులకు కలిగే ఉపాధి గురించి ఆలోచించాలని గ్రామపెద్దలను సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్ కోరారు.