S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మూతబడిన పరిశ్రమలు తెరిపించి కార్మికులకు న్యాయం చేయాలి

రామభద్రపురం, జూలై 26: జిల్లాలో ఫెర్రోఎల్లాయిస్, జ్యూట్ పరిశ్రమలు మూతబడడంతో వేలాదిమంది కార్మికులు రోడ్డునపడ్డారని, వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు జిల్లా టిఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి మమ్ముల తిరుపతిరావు వినతిపత్రం అందజేశారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ పరిశ్రమల యాజమాన్యాలకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలను బిల్లు రూపంలో నేరుగా అందిస్తే పరిశ్రమలు తెరవడానికి యాజమాన్యాలు సుముఖంగా ఉన్నాయని, ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే పోలీసు నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని రెండేళ్లు పెంచాలని కోరారు. ఆర్టీసీ విజయనగరం రీజియన్‌లో మూడు సీనియారిటీ లిస్టులను విడుదల చేసిందని, దీనిపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడంతో సిబ్బందికి ఎటువంటి పదోన్నతలు ఇవ్వరాదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వౌఖిక ఆదేశాలతో డిఎంలతో ఒత్తిడి తెచ్చి 20 మందికి పదోన్నతలు తెచ్చారని, ఈ పదోన్నతులు వెంటనే నిలుపుదల చేయాలని ఆయన కోరారు. అలాగే ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తుందని, ఇటువంటి విధానాలు నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంయుక్త కార్యదర్శి ఆర్‌జె.శేఖర్ పాల్గొన్నారు.