S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లాలో 250 రైస్ క్లబ్‌లు ఏర్పాటు

గజపతినగరం, జూలై 26: జిల్లాలో 250 రైస్ క్లబ్‌లు ఏర్పాటుచేశామని నాబార్డు ఎజిఎం ఆర్.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సహకార సంఘాల సభ్యులకు ఇస్తున్న శిక్షణ లో భాగంగా రెండవ రోజు ముఖ్య అతిథిగా హాజరై సభ్యులకు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్లబ్‌ల ద్వారా ఎంపిక చేసిన రైతులతో జిల్లాలో ఐదు ప్రాంతాలలో ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వీరిద్వారా నూతన విధానంలో పంటలు సాగు చేయడం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడం, మంచి ధరకు ఉత్తత్తి అయిన సరకులను విక్రయించుకోవడం చేపడతారని, ఈ సంఘాలకు నాబార్డు ద్వారా రుణాలు ఇవ్వడంతోపాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సంఘాలు పటిష్టంగా ఉండి మంచి ఫలితాలు సాధించాలంటే ప్రతినెలా సమావేశాలు నిర్వహించడంతోపాటు ఉద్యానవన శాఖ ద్వారా అమలుచేసే కార్యక్రమాలు, రాయితీలు, ప్రోత్సాహకాలను సభ్యులకు వివరించడం ద్వారా మరింత విస్తృతంగా సేవలను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్ జి.వి.లక్ష్మి, ప్రాంతీయ సమన్వయకర్త జోగినాయుడు పాల్గొన్నారు.