S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వరినాట్లకు కూలీల కొరత

అనకాపల్లి(నెహ్రూచౌక్), జూలై 26: వరుణుడు కరుణించినా అదునుమీద వరినాట్లు వేయలేని పరిస్థితి నెలకుంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు వరినాట్లు వేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే వ్యవసాయ పనులు చేయడానికి కూలీలు ముందుకు రాకపోవడంతో వరినాట్లు వేయడానికి కూలీల కొరత వెంటాడుతుంది. మహిళలు అధిక సంఖ్యలో అచ్యుతాపురం తదితర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో పనులు చేయడానికి మొగ్గు చూపించడంతో వ్యవసాయ పనులు చేయడానికి మహిళా కూలీలకు డిమాండ్ ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.
వరినారు తీసి నాట్లు వేయడానికి ఎకరాకు సుమారుగా పది నుండి 15మంది మహిళా కూలీల అవసరముంటుందని అయితే అందుకు కూలీల కొరత కారణంగా ఇతర ప్రాంతాల నుండి రెట్టింపు డబ్బులు చెల్లించి వ్యవసాయ పనులు చేసుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే దమ్ము చేయడానికి ట్రాక్టర్‌కు గంటకు 500 నుండి 600 రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. గతంలో కంటే ఈ ఏడాది వరినాట్లు వేయడానికి అధిక మోతాదులో పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడినప్పటికీ అదునుమీద నాట్లు వేయగలమో లేదోననే ఆందోళన నెలకొంటుందని రైతులు వ్యక్తం చేస్తున్నారు.