S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఐటి ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి కేంద్ర ఐటి శాఖ అభ్యంతరం

విశాఖపట్నం, జూలై 26: నగరంలో నిర్మించనున్న ఐటి ఇంక్యుబేషన్ సెంటర్‌కు పనులకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సిపిడబ్ల్యుడి) రూపంలో సమస్య వచ్చి పడింది. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఇండియా (ఎస్‌టిపిఐ), విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) సంయుక్తంగా ఈ ఇంక్యుబేషన్ సెంటర్‌ను నిర్మించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు టెండర్లను పిలిచేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో సిపిడబ్ల్యుడి ద్వారానే నిర్మాణ పనులు చేపట్టాలని స్పష్టం చేస్తూ తాజాగా కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిర్మాణ పనుల్లో జాప్యం అనివార్యం కానుంది. ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి 17 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని వుడా ఉచితంగా అందచేసింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వుడా, ఎస్‌టిపిఐల మధ్య ఈ ప్రాజెక్టుకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరింది. అయితే నిర్మాణ పనులు చేపట్టేందుకు, టెండర్లను ఆహ్వానించేందుకు తమకు బాధ్యత అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ఐటి శాఖకు వుడా లేఖ రాసింది.
దాదాపు 63 కోట్ల రూపాయలతో వుడా, ఎస్‌టిపిఐ సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నాయి. ఎస్‌టిపిఐ తన వాటా కింద 46 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. ఏప్రిల్ 2018నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. వుడా కార్యాలయం సమీపంలో నిర్మించే ఈ ఇంక్యుబేషన్ సెంటర్‌లో 50 యూనిట్లు ఏర్పాటు చేయవచ్చు. నౌకాయానం, పెట్రోలియం, విద్యుత్ రంగాల్లో ఐటి, ఐటి ఆధారిత సేవలకు సంబంధించి కొత్త ఆవిష్కరణలకు ఈ సెంటర్ వేదిక కానుంది. భవన డిజైన్ ఖరారీలో చోటు చేసుకున్న వ్యవహారాల కారణంగా ఇప్పటికే నిర్మాణంలో జాప్యం జరిగింది.
తాజాగా కేంద్ర ఐటి శాఖ ఆదేశాలతో మరికొంత జాప్యం అనివారం కానుంది. ఎస్‌టిపిఐతో ఒప్పందం చేసుకున్నాక, భవన నిర్మాణాన్ని సిపిడబ్ల్యుడికే అప్పగించాలనడంతో వుడా కంగుతింది. వుడాకు ఏ బాధ్యత లేకపోతే అంత విలువైన స్థలం ఏలా ఉచితంగా ఇస్తారన్న వ్యాఖ్యలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించి, వుడాయే భవన నిర్మాణ బాధ్యత చేపడుతుందని వుడా అదనపు వీసీ కె.రమేష్ తెలిపారు.