S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మన్యంలో హెలికాప్టర్ చక్కర్లు

సీలేరు, జూలై 26: ఆంధ్రా - ఒడిషా సరిహద్దుల్లో మంగళవారం రెండు హెలికాప్టర్లు గగనంలో చక్కెర్లు కొట్టాయి. దీంతో ఎ. ఓ.బి. సరిహద్దు గిరిజనుల్లో ఆందోళన నెలకొంది. ఎటువంటి ప్రమాదం నెలకొందోనని గిరిజనులు భయాందోళన చెందారు. పి. ఎల్.జి. ఎ వారోత్సవాలు ఈనెల 28 నుంచి ఆగస్టు 2 వరకు మావోయిస్టులు విజయవంతం చేయాలని విస్తృత ప్రచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. ఈనేపధ్యంలో విశాఖ - తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు నుండి సీలేరు మీదుగా కటాఫ్ ఏరియా అయిన మల్కన్‌గిరి, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో అనువణువునా హెలికాప్టర్‌లో గాలింపు చర్యల చేపట్టారు. మావోయ్టిలకు పేరుగాంచిన ఎ. ఓ.బి.లో మావోయిస్టులకు ఎటువంటి సంఘటనలకు పాల్పడకుండా ముందుస్తుగానే ఇండియన్ రిజర్వ్‌డ్ బెటాలియన్‌కు చెందిన పోలీసులు కూడా హెలిక్టాపర్‌లో కటాఫ్ ఏరియాకు తరలించినట్లు సమాచారం. ఇప్పటికే మావోయిస్టులు మారుమూల గిరిజన గ్రామాల్లో బ్యానర్లు, కరపత్రాలను పంచిపెట్టి మావోయిస్టుల వారోత్సవాలను విజయవంతం చేయాలని, ప్రజా పోరాటంలో అమరులైన మావోల ఆత్మశాంతికి ప్రతీ ఒక్కరూ వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రా - ఒడిషా సరిహద్దు ప్రాంతం పోలీసులు విస్తృత సంఖ్యలో మోహరించి మావోయిస్టుల వారోత్సవాలను భగ్నం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో మన్యంలో ఎప్పుడేం జరుగుతుందోనని గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు.