S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లాను హరిత వనంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

విశాఖపట్నం, జూలై 26: జిల్లాను హరిత వనంగా తీర్చిదిద్దాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో అటవీశాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనం-మనం కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు. ఈ నెల 29న లాంఛనంగా ముఖ్యమంత్రి హరితాంధ్రప్రదేశ్ మిషన్‌ను ప్రారంభించనున్నారని, దీనిని విజయవంతం చేయాలని కోరారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కోటి మొక్కలను నాటేందుకు నిర్ణయించారని, జిల్లాలో 20 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ప్రతి పరిశ్రమ ఆవరణలో 500 మొక్కలను నాటాలని, ఈ కార్యక్రమాన్ని ఒకరోజుకే పరిమితం చేయకుండా నిరంతరం కొనసాగించాలన్నారు. మొక్కల సంరక్షణ బాధ్యతగా చేపట్టి, జిల్లాను హరిత వనంగా తీర్చిదిద్దాలన్నారు. ఫొటోలను తీసి సామాజిక మాధ్యమాలలో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో వనం-మనంఎట్‌విశాఖ పేజీని ఆయన ప్రారంభించారు. 27లోగా ఇందుకు అవసరమైన గోతులను తవ్వి ఉంచాలన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2012-17 మధ్య 40 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇప్పటికి 23 లక్షల మొక్కలను నాటామన్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ప్రతీప్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాల్లో పచ్చదనం పెంపునకు సహకరించాలన్నారు. విద్యా సంస్థల్లో మొక్కలు నాటాలన్నారు. ఈ సమావేశంలో జెసి-2 వెంకటరెడ్డి, సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్‌ఒ సూర్యనారాయణ, వుడా డిఎఫ్‌ఒ రాజారావు పాల్గొన్నారు.