S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

షుగర్స్ రైతులకు రూ. 43 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి

అనకాపల్లి, జూలై 26: జిల్లాలోని తుమ్మపాల, గోవాడ, ఏటికొప్పాక, తాండవ ఈ నాలుగు షుగర్ ఫ్యాక్టరీల చెరకు రైతులకు బకాయిలు పడిన 43కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించి వారిని ఆదుకోవాలని మాజీమంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్ చేసారు. మంగళవారం స్థానిక వ్యవసాయదారుల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఇవ్వాల్సిన రవాణా సబ్సిడీ, పర్చేజ్‌ట్యాక్స్ బకాయిలను సైతం చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చెరకు చట్టం ప్రకారం సరఫరా చేసిన 14రోజుల్లో సంబంధిత చెరకుకు సంబంధిత బకాయిలను విధిగా చెల్లించాలన్నారు. నిర్ధేశిత సమయం దాటితే 15శాతం అదనంగా వడ్డీ రూపంలో చెల్లించాలన్నారు. రైతులను అమాయకులను చేసి ఈ చట్టాలను పాలకులు తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తుమ్మపాల ఫ్యాక్టరీ రైతులకు రెండుకోట్లు, గోవాడ రైతులకు 24కోట్లు, ఏటికొప్పాక రైతులు 9.60కోట్లు, తాండవ చెరకు రైతులకు 7.30కోట్లు చెల్లించాల్సివుందన్నారు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. తుమ్మపాల ఫ్యాక్టరీకి రెండుకోట్ల రుణం ఇవ్వడానికి రాష్ట్ర సహకార బ్యాంక్ ఫ్యాక్టరీకి చెందిన 20కోట్ల ఆస్తులను రిజిస్ట్రర్ తనఖా చేయించుకోవడం విచారకరమన్నారు. రెండుకోట్ల రుణంతో 20కోట్ల ఆస్తులను తాకట్టుపెట్టడం న్యాయమా అని, ప్రభుత్వం బ్యాంక్‌కు గ్యారంటీగా ఉండి రైతులకు ఆ మొత్తాన్ని పేమెంట్లుగా విడుదల చేయాలని దాడి డిమాండ్ చేసారు. రెండేళ్లుగా మూతపడిన తుమ్మపాల ఫ్యాక్టరీపై ప్రభుత్వం జోనల్ విధానాన్ని కూడా అమలు చేయలేదన్నారు. జిల్లాలో నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీలకు ఇక్కడ పండిన చెరకు అవసరం కాగా దళారీలు అక్రమంగా చొరబడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ప్రైవేట్ ఫ్యాక్టరీలకు ఇక్కడి చెరకును తరలించే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. చోడవరం, అనకాపల్లి ప్రాంతాల్లో లక్ష టన్నుల చెరకు ఆ విధంగా ప్రైవేట్ ఫ్యాక్టరీలకు తరలిపోయిందన్నారు. షుగర్ కేన్ అధికారులు దళారులతో మిలాఖతై ఈ అక్రమ చెరకు తరలింపులను ప్రోత్సాహిస్తున్నారని ఆరోపించారు. తుమ్మపాల ఫ్యాక్టరీలో ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు నాలుగు కోట్ల బకాయిలు చెల్లించాల్సివుందన్నారు. అత్యవసర యంత్రాలు సమకూరిస్తే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరచుకుంటుందని, 25కోట్లు ప్రభుత్వం గ్రాంటుగా మంజూరు చేస్తే ఈ ఫ్యాక్టరీని తాత్కాలికంగా నడిపించవచ్చునన్నారు. ఆధునీకరణ చేసి ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి దాడి డిమాండ్ చేసారు.