S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సీజనల్ వ్యాధులపై అప్రమత్తం కండి

ఎచ్చెర్ల, జూలై 26: వర్షాకాలం కావడం వలన గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొనే పరిస్థితులు అధిగమించి సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపిడివో పంచాది రాధ స్పష్టంచేశారు. ఇప్పటికే ఈ సమాచారాన్ని సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శులకు తెలియజేశామన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు. 13,14వ ఆర్థిక సంఘంనిధులతో ప్రతీ గ్రామపంచాయితీలో ఐదు బస్తాలు బ్లీచింగ్, ఫినాయిల్ నిల్వలు కొనుగోలు చేసి బావులు, బోర్లు, మంచినీటి పథకాల వద్ద క్లోరినేషన్ నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు స్థానిక హెల్త్‌సిబ్బందితోసమన్వయంగా వ్యవహరించి వైద్య సేవలు పౌరులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విష జ్వరాలు, అతిసార వంటి వ్యాధులు ఉన్నట్లయితే తక్షణమేవైద్య శిబిరాలు నిర్వహించేలా ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.