S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రూ. 26 కోట్లతో వంశధార మంచినీరు: విప్

ఆమదాలవలస, జూలై 26: మండలంలోగల పొన్నాం, రామచంద్రాపురం, చిట్టివలస, సైలాడ, జొన్నవలస పంచాయతీలకు సుమారు రూ.26కోట్లతో వంశధార సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు విప్ రవికుమార్ తెలిపారు. మంగళవారం మండలం సైలాడ గ్రామంలో సుమారు రూ.5లక్షల వ్యయంతో నిర్మించి సోలార్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌ఆర్ డి, డబ్లూ పి పథకం కింద ఏర్పాటు చేసిన ఈస్కీమ్‌ను దండెంవలస, కంచరాపువానిపేట, మండాది గ్రామాల్లో ఈ స్కీమ్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ గ్రామాలకు సమీపంలోగల వంశధార నదిలో ఫిల్టర్ బావులు ఏర్పాటు చేసి సోలార్ వాటర్ స్కీమ్‌ను అనుసందానం చేస్తామని విప్ రవికుమార్ తెలిపారు. సైలాడ గ్రామంలో 300మంది జనాభా ఉండగా వీరికి 24 గంటలు మంచినీరు అందించాలన్నారు. అనంతరం కుమ్మరిపేట గ్రామంలో సుమారు రూ.5లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించి మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జోగిచంద్రశేఖర్, ఆర్ డబ్ల్యూ ఎస్ డి ఇ ఆశాలత, దేశం నాయకులు యడ్ల చిన్నప్పయ్య, తమ్మినేని అమర్‌నాథ్; గురుగుబెల్లి గిరి, ఇప్పిలి సూర్యారావు పాల్గొన్నారు.