S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కృష్ణా పుష్కరాల్లో వివిధ అంశాలపై సదస్సులు

శ్రీకాకుళం, జూలై 26: కృష్ణా పుష్కరాలు నిర్వహించే సమయంలో విజయవాడలో 12 అంశాలపై సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా, మండల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పుష్కరాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని అందుకుగాను పేదరికంపై గెలుపు, సాంకేతిక పరిజ్ఞానం వంటి 12 అంశాలపై సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతీ ఒక్కరూ వినూత్నంగా ఆలోచించాలన్నారు. వినూత్న ఆలోచనలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్ సొసైటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ జిల్లాలో ఇన్నోవేషన్ సొసైటీ శాఖలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో ఇన్నోవేషన్ అధికారిని నియమిస్తామన్నారు. అదే విధంగా ప్రతీ శాఖలో సాఫ్ట్‌వేర్ అధికారి, శిక్షణ అధికారి, డివైసెస్, అధికారిని నియమిస్తామని చెప్పారు. ప్రజా సాధికార సర్వేను త్వరితగతిన చేపట్టాలన్నారు.
బిడ్డ పుడితే మొక్కను ఇస్తాం: బిడ్డపుడితే మొక్కను ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. బిడ్డను ఏ విధంగా పెంచి పోషిస్తామో అదే విధంగా ఆ మొక్కను పెంచి పోషించాలని కోరారు. 29న రాష్ట్రంలో కోటిన్నర మొక్కలను నాటనున్నట్టు తెలిపారు. ప్రతీ జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. విశ్వవిద్యాలయాలు తదితర పెద్ద సంస్థలు స్వయంగా నర్సరీలను ఏర్పాటు చేయాలని సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతీ శాఖ, ప్రతీ పౌరుడు సొంత కార్యక్రమంగా భావించి పాల్గొనాలన్నారు. అటవీ శాఖముఖ్య కార్యదర్శి పి.రమేష్‌కుమార్ మాట్లాడుతూ అన్నివిద్యా సంస్థలు, ఆలయాలు, ప్రార్థనాసంస్థలు, కార్యాలయాలు తదితర అన్ని ప్రదేశాలలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పుష్కర ప్రత్యేక అధికారి మాట్లాడుతూ పెద్ద పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడలో ఆరు కిలోమీటర్ల పొడవుగల ఘాట్లను నిర్మించామన్నారు. ఇందులో కృష్ణవేణి ఘాట్, పద్మావతి ఘాట్, దుర్గాఘాట్ ప్రధానమైనవని ఒక్కొక్కటి కిలోమీటరున్నరకు పైగా నిడివిగలవన్నారు. రాష్ట్ర డిజిపి, ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ పుష్కరనగర్‌లు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా ప్రత్యేక బ్సు స్టాండులను ఏర్పాటు చేసి అచ్చట నుండి ఉచిత ఆర్‌టిసి సిటీ బస్సులు నడుపుతామన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి వివేక్‌యాదవ్, జెసి-2 రజనీకాంతారావు, డుమా పీడి కూర్మనాథ్, జిల్లా సరఫరా అధికారి పలువురు అధికారులు పాల్గొన్నారు.