S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సరి‘హద్దు’ల సర్దుబాటు!

శ్రీకాకుళం, జూలై 26: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో చాలా కాలంగా మావోల కార్యకలాపాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆ నిశ్శబ్దం వెనుక వ్యూహాం దాగివుందనే పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానాలు వాస్తవమే అన్నట్టువుంది. రేపటి నుంచి జరగనున్న మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో చాపకింద నీరులా మావోల కార్యక్రమాలు మళ్లీ నాందిపలికేందుకు సద్వినియోగం చేసుకునేలా ఎఒబి మావోనేతలు వ్యూహం రచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 28 నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు అమరవీరుల వారోత్సవాలను నిర్వహించాలని మావోయిస్టులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తూర్పు కనుములకు పడమరవైపుగల గల తువ్వాకొండల మొదలు మహేంద్రగిరులు వరకూ రిక్రూట్‌మెంటు క్యాంపైన్‌లు నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఎఒబి, కొండబారిడి దళాలతోపాటు శబరి ఏరియా కమిటీలు పాలుపంచుకున్నట్టు పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి.
ప్రణాళికపై ఇంటెలిజెన్స్ వద్ద సమాచారం
ముందస్తు వ్యూహాంగా ఎఒబిలో గతంలో మూసుకుపోయిన ఏడు సెఫ్టీజోన్‌లు ఇప్పుడు తెరిచినట్టు తెరిచే వాటికి హద్దులు, మార్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారుల వద్ద సమాచారం ఉన్నట్టు తెలిసింది. ఏదైనప్పటికీ, ఈ వారోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ఏపీ గ్రామాల్లో మావోయిస్టుల కార్యకలాపాలను నిర్వహించేందుకు ఎఒబి కమిటీలో నాలుగు ఎల్‌వోఎస్‌లు బాగా పనిచేసేలా వ్యూహాన్ని రచిస్తున్నట్టు పోలీసువర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత నల్లమల్ల అడవుల్లో జల్లెడపట్టిన పోలీసులకు చిక్కకుండా తూర్పుకనుల నుంచి తువ్వాకొండల్లోకి ప్రవేశించిన మావోనేతలు కొన్నాళ్ళు మహేంద్రగిరుల్లో తలదాచుకుంటున్న సమయంలో ఎఒబిలో జరిగిన అత్యంత కీలకమైన కూంబింగ్‌తో వారంతా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గల కాకులుదూరని అడవులకు చేరిపోయిన విషయం పోలీసులతోపాటు, సామాన్యులకు కూడా తెలిసిందే! ఇలా... నాలుగేళ్ళుగా మావోల కదలికలు లేని జిల్లాలో ఒడిశా సరిహద్దు గ్రామాలు దండకారణ్యంలో మకాంపెట్టేందుకు ఈ వారోత్సవాలను సద్వినియోగం చేసుకునేందుకు మావోనేతలు వ్యూహాన్ని పడుతున్న విషయాని గమనించిన పోలీసుశాఖ కూడా అప్రమత్తమై వారి కదలికలపై మరింత నిఘాపెంచింది. కూంబింగ్ ఉద్ధృతం చేసేందుకు జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి కూడా తమ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు కోసం వేచిచూస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అనుమతులే వస్తే - తూర్పుకనుముల్లో సెఫ్టీజోన్స్‌లు తెరిచి మార్గాలు, సరిహద్దులు సర్దుబాటుల్లో అంచనాలు, ప్రణాళికలు వేస్తున్న మావోనేతల ఏర్పాటు చేసుకుంటున్న స్థావరాలపై నిఘాపెంచేందుకు జిల్లా పోలీసుశాఖ సన్నద్ధం అవుతోంది. ఎఒబి సరిహద్దులోని గ్రామాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న మావోలు వారిని అడ్డుకునేందుకు పోలీసుల మధ్య ఈ మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు అలజడి సృష్టించినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఎఒబి మావోయిస్టు కేడర్ ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మకాంపెట్టి రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తోంది. చాలాకాలంగా మందుపాత్రలు పేలడం, ఎదురుకాల్పులు జరగడం, కూంబింగ్‌లు నిర్వహించడం వంటి పరిస్థితులకు దూరంగా గిరిజన గూడలన్నీ ప్రశాంతవాతావరణంలో ఉండగా, మరికొద్దిరోజుల్లో యుద్ధవాతావరణం కలిగే ప్రమాదం ఎఒబికి లేకపోలేదంటూ పోలీసుఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. అమరవీరుల వారోత్సవాల నిర్వహణ నేపథ్యంలో ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకునే అవకాశం కన్పిస్తోంది.
అప్రమత్తం చేశాం : ఎస్పీ బ్రహ్మారెడ్డి
మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల్లో ఎఒబిలో గిరిజన గూడలతోపాటు, ఆ ప్రభావం కలిగిన మండలాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తం చేశామని ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. వారం రోజులపాటు ఆకస్మిక తనిఖీలు, సరిహద్దు గ్రామాల్లో కూంబింగ్ చేపడుతున్నామని, ఈ వారం రోజులు రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసినట్టు చెప్పారు.
సరిహద్దు గ్రామాల్లో పర్యటించేటప్పుడు రాజకీయ నాయకులు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సివుందని, వారికి ప్రత్యేక బలగాల నడుమ కార్యక్రమాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎఒబి గ్రామాల్లో మావోయిస్టుల ప్రభావం పడుకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వివరించారు.