S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లా టిడిపి మంచుకోట?

శ్రీకాకుళం: టిడిపి అధినేత చంద్రబాబు లక్ష్యం 2019 నాటికి 80శాతం ఓటర్లు పార్టీ కుటుంబ సభ్యులు కావాలి. ఈ లక్ష్యంతో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకువెళ్లండని ఎమ్మెల్యేల పనితనానికి గ్రేడింగ్ ఇచ్చి శ్రమిస్తున్నారు. అంతే కాకుండా ప్రతీ ఎమ్మెల్యేతో ముఖాముఖి నిర్వహించి నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వౌకిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రతికూల పరిస్థితులను చక్కదిద్ది పార్టీని మరింత క్రమశిక్షణగా ముందుకు నడిపించేలా రూపొందించిన సమీక్షలు మూడు రోజులు జరగనున్నాయి.
జిల్లాలో టిడిపి గత వైభవం పదిలంగా కాపాడుకునేందుకు, నేతల మధ్య సమన్వయం కుదిర్చి పనితీరును మెరుగుపర్చుకునేలా దిశాదశా నిర్దేశం చేసే ఉద్దేశంతో ఈనెల 27 నుంచి నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు పట్ల ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి అయినా నేటికీ ప్రజామన్ననలు పొందడంలో వెనుకబడి కూడా టార్గెట్-2019 అధికారం అంటూ ఏం ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తామని వారు నేతల తీరును ప్రశ్నిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం లేకపోవడంతో ఎదోలా గట్టెక్కిన పార్టీ ప్రజాప్రతినిధులు ఈ రెండేళ్లు ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా వ్యవహరించడం కార్యకర్తల్లో ఒకింత నైరాశ్యం నింపిందనే చెప్పొచ్చు.
2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో తప్పటడుగులు వేయడం, జన్మభూమి కమిటీల పేరుతో అధికార యంత్రాంగాన్ని పూర్తి నిర్లిప్తతలో ఉంచడంతో సామాన్యునికి ప్రభుత్వ పథకాల లబ్ధిమాట అటుంచితే, పూర్తిగా అనర్హునిగా చేయడం ప్రజల్లో టిడిపి పట్ల వ్యతిరేక భావం నెలకొనేలా చేసింది. ఇదే అదనుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో బాబు హామీలపై కరపత్రం ముద్రించి, వాటిలో ప్రభుత్వం అమలుచేసినది శూన్యమంటూ ప్రజల మధ్యకు వెళ్ళడం కూడా ప్రజలను ఆలోచింపజేసింది. పైగా అధికారం చేపట్టిన నాటినుంచి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నేతలు ఎంత సంపాదించారు? ప్రస్తుతం మనం ఎంత సంపాదించాలి? అన్న చందంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పోటీపడి మరీ ఇసుకను తరలించడం పార్టీ పరువును బజారుకీడ్చింది. దీనిపై స్వయంగా టిడిపి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతటివారే ఇసుకతో ప్రభుత్వం పరువు పోయిందని ఆవేదన చెందిన సందర్భాన్ని ఉదహరించవచ్చు.
కుదిపిన లిక్కర్ మాఫియా
లిక్కర్ మాఫియా జిల్లాలో ఒక కుదుపు కుదిపిందని చెప్పొచ్చు. అధికార పార్టీ నేతలు నువ్వే మాఫియా లీడర్, అంటే కాదు నువ్వే మాఫియా లీడర్ అంటూ కీచులాడుకోవడం ప్రజల్లో పార్టీ మరింత చులకనగా మారింది. ఓ పక్క ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గ అభివృద్ధిని విడిచిపెట్టి పక్క నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది, తమ వాటా ఎంత? అంటూ స్వపక్షంలోనే విపక్షంలా ప్రవర్తించడం ప్రజల్లో అయ్యో, ఇదేనా మనం ఆశించిన టిడిపి పాలన అనేలా చేసింది. ఎపుడూ నేను మారాను, మీరు మారండి అంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబునాయుడు అధికారం వచ్చాక అధికార యంత్రాంగాన్ని పూర్తిగా సభలు, సమీక్షలకు పరిమితం చేయడం కూడా అభివృద్ధి కుంటుపడటానికి దోహదం అయింది. దీనిపై సాక్షాత్తు బ్యూరోక్రాట్లే కొంతమంది ఎపుడూ సమీక్షలేనా? అంటూ విమర్శించడం పట్ల తెలుగుదేశం పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబునాయుడు నెలకోమారు జిల్లా ఇంచార్జి మంత్రితో కలిసి, జిల్లాకు చెందిన మంత్రి, పార్టీ నేతలు సమీక్షలు నిర్వహించాలని, ప్రజాపథకాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాలని జిల్లా అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించారు.
ఇప్పటికే పార్టీ సంస్థాగత నాయకులు, ప్రభుత్వంలో గల నేతల మధ్య సమన్వయలోపంతో ఎత్తులుచిత్తులు వేసుకుంటున్న ప్రతినిధుల్లో సమన్వయం కుదిర్చి, వారిలో రాజీమార్గంలో ఒకే వేదికపైకి తీసుకురావడం జిల్లా అధ్యక్షురాలికి చాలినంత అనుభవం లేకపోవడం కూడా జిల్లా టిడిపికి నష్టమే! జిల్లాలో పది నియోజకవర్గాలకు ఏడుగురు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఇద్దరు, ముగ్గురికే కొమ్ముకాస్తున్నారన్న విమర్శ సైతం లేకపోలేదు.
ఇటువంటి సమస్యల నడుమ పార్టీ నేతలతో కలిసి నియోజకవర్గ స్థాయి సమీక్షలు నిర్వహించడం ద్వారా పార్టీ గత వైభవం పదిలంగా ఉంటుందా అంటే దానికి సమాధానం దొరకని పరిస్థితి. జిల్లాకు ఇంచార్జి మంత్రిగా పరిటాల సునీత ఇటువంటి సమావేశాలకు హాజరుకావడం చాలా అరుదు. అయినా తనవంతు బాధ్యతగా ఆమె ఏడాదిలో రెండు, మూడు సార్లు జిల్లాకు చెందిన సీనియర్ నేతలను కలిసి పార్టీపరిస్థితిపై ఆరాతీయడం మినహా, పార్టీ నేతల మధ్య సమన్వయం కుదర్చలేకపోతున్నారన్నది బహిరంగంగా టిడిపి కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. నామినేటెడ్ ఉద్యోగాల కోసం కేడర్ దరఖాస్తు చేసుకోవడమే మిగిలిపోయింది తప్ప అనేక మంది సీనియర్లకు కనీస గుర్తింపు కలిగిన పదవులను కూడా కేటాయించలేదన్న అపవాద కూడా లేకపోలేదు. జిల్లాలో ఉన్న పవర్ సెంటర్ల ప్రచ్ఛన్న యుద్ధం పసుపుదళాన్ని మరింత నిరుత్సాహానికి గురిచేస్తోంది. కార్పొరేట్ తరహా రాజకీయాలే నెరపడం వలన సామాన్య కార్యకర్తకు కనీస ప్రయోజనం కూడా లేకుండా పోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రామస్థాయి నేతలకు గుర్తింపు ఏది?
గ్రామస్థాయి నేతలకు తగిన గుర్తింపు లభించడంలేదని ఆ పార్టీ నేతలు బహిరంగంగా జిల్లా అధిష్ఠానంపై అక్కసు వెల్లగక్కుతున్నారు. బదిలీల నుంచి పథకాల పంపిణీ వరకు ఎటువంటి భాగస్వామ్యం లేకుండా సిఫార్సుల మేరకే పనులు చకచక జరిగిపోతున్నాయని మండల స్థాయి నేతలు మనస్తాపానికి గురవుతున్నారు. దీనంతటికీ జిల్లానేతల మధ్య సమన్వయ లోపం సుస్పష్టంగా కన్పిస్తోందంటున్నారు. ఇదే విషయంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే నేతల మధ్య సమన్వయం లేదని వ్యాఖ్యానించిన సందర్భాలనేకం. ఇక నియోజకవర్గ స్థాయి సమావేశాల పేరుతో బుధవారం నుంచి నిర్వహించనున్న పార్టీ సమావేశాలు ఎంతమేర పార్టీకి లబ్ధిచేకూరుస్తుందో వేచిచూడాలి. దీనికోసం జిల్లాకు వస్తున్న ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీత ఆశయం ఎంతవరకూ నెరవేరుతుందోమరి!

.........