S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘వనం-మనంలో అందరూ భాగస్వాములు కావాలి’

వేటపాలెం, జూలై 26: ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజలందరూ ఈ నెల 29న జరగనున్న వనం-మనం కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటాలని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్, చీరాల నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎంఎస్ మురళి పిలుపునిచ్చారు. మండలంలోని పందిళ్లపల్లిలో జరుగుతున్న పల్స్‌సర్వేను ఆయన మంగళవారం పరిశీలించి అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వర్ లోపాల కారణంగా రెండు రోజులుగా స్మార్ట్ సర్వే నిదానంగా సాగుతుందని, ఒక్కో కుటుంబం వివరాల సేకరణకు సుమారుగా గంట సమయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి సాంకేతిక శిక్షణ లేకపోవడం కూడా సర్వే నిదానంగా సాగడానికి ఒక కారణంగా ఆయన పేర్కొన్నారు. వనం-మనం కార్యక్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల వెంట మొక్కలు నాటడంతో పాటు ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంకుడు గుంటల సమీపంలో మొక్కలు నాటడం వల్ల మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ప్రధాన బాధ్యతగా గుర్తించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను డ్వాక్రా మహిళలకు గతంలో ఇచ్చినందున వాటిని కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు రాలేదని, పాఠశాల యాజమాన్య కమిటీల నియామకం అనంతరం నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంపిడివో సిహెచ్‌వి బాలకృష్ణారావు, డిప్యూటీ తహశీల్దార్ మాధవీలత, ఎఎస్‌వో రామకృష్ణ, వెలుగు ఎపిఎం శ్రీనివాసరావు, ఆర్‌ఐ సూర్యనారాయణ తదితరులున్నారు.