S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆదాయ వెల్లడి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

పొదిలి, జూలై 26 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌కంటాక్స్ జాయింట్ డైరెక్టర్ ఆనంద్ కోరారు. మంగళవారం స్థానిక వాసవీ కల్యాణ సదన్‌లో ఆదాయ వెల్లడి పథకం పట్ల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాయింట్ డైరెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ ఆదాయ ఆస్తుల వివరాలు వెల్లడించని వారు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలన్నారు. తమ గుప్త ఆస్తుల వివరాలను తమ శాఖకు వెల్లడించాలని కోరారు. అలాంటి వారి వివరాలను ఇతర శాఖలకు అందించబోమన్నారు. వారి పట్ల ఎలాంటి వేధింపు చర్యలు కాని, విచారణలు కాని ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ఆర్‌సి చైర్మన్ రాంప్రసాద్, ఎస్‌వికెపి డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ జి చెంచు సుబ్బారావు, ఆదాయ పన్నులశాఖ అధికారులు వై వెంకట్రావు, ఎస్ జగదీష్, బిటి సత్యనారాయణ, సిహెచ్ అంజనీదేవి, చార్టెడ్ అకౌంటెంట్లు, వాణిజ్య ప్రముఖులు పాల్గొన్నారు.