S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

పొదిలి, జూలై 26 : ప్రభుత్వ వైద్య సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు కోరారు. మంగళవారం ఆయన ఉప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి బ్రహ్మతేజను ఆరోగ్య కేంద్రం నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. ఉదయానే్న ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి విధులు నిర్వర్తించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేసి మంచిపేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువగా పేదలే వస్తుంటారని, ఆ విషయాన్ని వైద్యాధికారులు, సిబ్బంది దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో వౌలిక వసతులపై ఆరాతీసి జిల్లా వైద్యాధికారిణితో మాట్లాడారు. ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో చిల్లచెట్లు పెరిగి ఉండటాన్ని ఆయన గమనించి, వెంటనే వాటిని తొలగించి ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. జడ్పీ చైర్మన్ వెంటనే జడ్పీటిసి సాయిరాజేశ్వర్ తదితరులు ఉన్నారు.