S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోడ్డెక్కిన చిరు వ్యాపారులు

కందుకూరు, జూలై 26: స్థానిక ఆర్టీసీ డిపో వద్ద డిపోలోకి బస్సులు వెళ్లే రోడ్డు మార్జిన్‌లో ఎన్నో ఏళ్లుగా చిన్నచిన్న బంకులు ఏర్పాటు చేసుకుని గాజులు, చెప్పులు తదితర వ్యాపారాలు నిర్వహించుకుంటూ జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారుల దుకాణాలను ఇటీవల అంకమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా తొలగించారు. తిరునాళ్ల సందర్భంగా బంకులు తొలగిస్తున్నామని, తిరునాళ్ల అయిపోయిన వెంటనే తిరిగి బంకులు పెట్టుకోవచ్చునని చెప్పిన ఆర్టీసీ అధికారులు బంకులు పెట్టుకోనివ్వకుండా మంగళవారం రోడ్డు ఎడుమ వైపున మార్జిన్‌కు ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. ఉదయానే్న దుకాణాలు పెట్టుకోవడానికి ఆ ప్రాంతానికి చేరుకున్న చిరు వ్యాపారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంతలో ఆర్టీసీ డిపో అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో బంకులను ఏర్పాటు చేసుకునే స్థానంలో ఖాళీ బస్సులను నిలిపి బంకుల ఏర్పాటును అడ్డుకున్నారు. దీంతో చిరు వ్యాపారులు బంకులు ఏర్పాటు చేసుకోనివ్వకపోతే తమ జీవనం ఎలా జరుగుతుందని ఆర్టీసీ అధికారులను నిలదీశారు. సమాచారం అందుకున్న వివిధ ప్రజాసంఘాల నాయకులు కె వీరారెడ్డి, కాపునాడు జిల్లా ఉపాధ్యక్షులు దారం మాల్యాద్రి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వి రాఘవులు, సురేష్, ఎంఆర్‌పిఎస్ నాయకులు శ్యామ్‌మాదిగ, దళిత సంఘాల నాయకులు పి చెన్నకేశవులు తదితరులు ఆ ప్రాంతానికి చేరుకుని చిరు వ్యాపారులకు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ ప్రవేశ ద్వారం వద్ద చిరు వ్యాపారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో డిపోలోకి బస్సులు రాకుండా నాలుగు చక్రాల బండ్లను రోడ్డుగా అడ్డంగా పెట్టి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఓవి రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. నిరసనను ఉద్దేశించి పలువురు చిరు వ్యాపారులు మాట్లాడుతూ అధికారులు సానుకూలంగా స్పందించి బంకులను ఏర్పాటు చేసుకోనివ్వాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు. వీరారెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం రక్షణ చట్టం తెచ్చిందని, వారు బజారులో అమ్ముకునే హక్కు ఉందన్నారు. ఎవరో ప్రయోజనాల కోసం చిరు వ్యాపారుల పొట్టకొట్టడం సరికాదన్నారు. గతంలో అధికారులు గుర్తించిన ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణదారుల కబంధ హస్తాల్లో ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకోని అధికారులు చిరు వ్యాపారుల పై ప్రతాపం చూపడం సరికాదన్నారు. ఎవరి అనుమతితో ఆర్టీసీ అధికారులు రెండు రోజులు పాటు డిపోను మూసివేసి కరెంట్ ప్రభలను పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చారో తెలియజేయాలని ప్రశ్నించారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపిన తరువాత దుకాణాలను తొలగించాలని అన్నారు. రోడ్డును నమ్ముకుని బతుకుతున్న చిరు వ్యాపారులను వేధించడం మంచిది కాదన్నారు. ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ శ్యామ్‌మాదిగ మాట్లాడుతూ చిరు వ్యాపారులు రోడ్డు మార్జిన్ నమ్ముకుని వ్యాపారం చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని, వారి బతుకులను రోడ్డుమీదకు ఈడ్చిన ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరిని ఆయన ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరు వ్యాపారులను గుర్తించి వారికి ముద్ర రుణాలను మంజూరు చేయించి వారిని ఆదుకోవాలని జీఓ జారీ చేస్తే ఆ విషయాన్ని అధికారులు విస్మరించి చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టడం తగదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిరు వ్యాపారులు బంకులను ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగించే విధంగా సహకరించాలని కోరారు. చిరు వ్యాపారుల, ప్రజాసంఘాల నాయకుల నిరసన సమాచారం అందుకున్న కందుకూరు సిఐ ఎం లక్ష్మణ్, పట్టణ ఎస్‌ఐ సిహెచ్ హజరత్తయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ఆర్టీసీ అధికారులు, ప్రజాసంఘాల నాయకులు, చిరు వ్యాపారులతో చర్చించారు. వారి చర్చల అనంతరం ఆర్టీసీ అధికారులు బస్సులను తొలగించారు. మంగళవారం సాయంత్రం ఇరు వర్గాలతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సిఐ తేల్చి చెప్పడంతో సమస్య ప్రస్తుతానికి సద్దుమణిగింది.