S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ర్యాగింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలి

ఒంగోలు, జూలై 26 : జిల్లాల్లోని కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సిపివో సమావేశ మందిరంలో ర్యాగింగ్ నిరోధ విధానంపై పోలీసులు, కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో కమిటీలు ఏర్పాటుచేసి ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌పై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కళాశాలల ప్రిన్సిపాల్‌లకు సూచించారు. జిల్లాస్థాయిలో తాను చైర్మన్‌గా, జిల్లా ఎస్‌పి వైస్ చైర్మన్‌గా, ఆర్‌డివో, డిఎస్‌పిలు, కాలేజి ప్రిన్సిపాల్ సభ్యులుగా ఉంటారన్నారు. అదేవిధంగా డివిజన్ స్థాయిలోను కమిటీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాసింను ఆదేశించారు. ప్రతి కాలేజిలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటుతో పాటు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలని కళాశాలల యాజమాన్యాలకు కలెక్టర్ సూచించారు. కమిటీల ఏర్పాటు నివేదికను అందించాలన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడితే జరిగే నష్టాలను విద్యార్థులకు వివరించడం ద్వారా ర్యాగింగ్‌ను అరికట్టవచ్చని తెలిపారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ కారణంగా విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ర్యాగింగ్ చట్టంలోని అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కళాశాలల విద్యార్థులతో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి ర్యాగింగ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత కళాశాలల యాజమాన్యాలపై ఉందన్నారు. విద్యార్థులను మానసికంగా, అసభ్యకరంగా బాధపెట్టినా ర్యాగింగ్ కిందకు వస్తుందన్నారు. ర్యాగింగ్ చేసినట్లుగా నిర్ధారణ అయిన విద్యార్థులను డీబార్ చేయాలని, ఏ కాలేజిలోను తిరిగే చేరేందుకు అవకాశం లేకుండా చేయాలని, అదేవిధంగా అతని మార్కుల మెమోలో ప్రముఖంగా ర్యాగింగ్‌కు పాల్పడినట్లుగా పెద్ద అక్షరాలతో కనిపించేలా చూడాలని కలెక్టర్ కళాశాలల ప్రిన్సిపాల్‌లకు సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాసీం మాట్లాడుతూ కళాశాలల్లో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు కళాశాల క్యాంపస్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ర్యాగింగ్ చట్టం వల్ల జరిగే నష్టాలు, శిక్షల గురించి విద్యార్థులకు తెలియచేసి ర్యాగింగ్‌కు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కళాశాలల ప్రిన్సిపాల్‌లు తమ కళాశాలల్లో కమిటీ ఏర్పాటు చేసుకుని ర్యాగింగ్ జరగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఒంగోలు ఆర్‌డివో కె శ్రీనివాసరావు, రిమ్స్ డైరెక్టర్ రాజ్‌కుమార్, డిఎస్‌పి మరియదాసు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్‌లు పాల్గొన్నారు.