S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిరుద్యోగ ఎస్సీ యువతకు 250 కాబ్‌లు

నెల్లూరు, జూలై 26: నిరుద్యోగ ఎస్సీ యువతకు ఆర్థిక భరోసా కల్పించే చర్యల్లో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 250 కాబ్‌లను అందచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు వెల్లడించారు. మంగళవారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ కార్పొరేషన్‌లో రూ.857 కోట్ల నిధులు వివిధ సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది లబ్ధిదారులను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేసి వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దళితులు వ్యాపారవేత్తలుగానూ, పారిశ్రామికవేత్తలుగానూ రూపుదిద్దుకునేలా ఈ శిక్షణ ఉంటుందన్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో దుకాణాల కేటాయింపులో ఎస్సీలకు ప్రత్యేక అవకాశం కల్పించే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించడమే దళితుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియచేస్తోందన్నారు. ఆత్మగౌరవంతో వైసిపిలోని ఎస్సీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారని అన్నారు. విడిపోయి నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రోజుకు 20 గంటలు పనిచేస్తూ తనలా పనిచేసే ఒక బృందాన్ని ఏర్పాటు చేశారని, తామంతా అందులో సభ్యులమేనని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికారత సర్వేను హేళన చేస్తూ గడప గడపకు వైసిపి అబద్ధాలను చేరవేసే పనిలో పడిందని, ప్రజలు వారి వ్యవహారాన్ని చూసి హేళన చేసే పరిస్థితి తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు.