S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అందరికీ గూడు..

నెల్లూరు, జూలై 26: జిల్లాలోని పట్టణ పేదల సొంతింటి కల నెరవేరబోతోంది. పట్టణ పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలి విడతలో ఇళ్లు పొందడానికి దాదాపు సుమారు 5నెలల క్రితమే వేలాది మంది నగరపాలక, పురపాలక సంస్థల్లో దరఖాస్తులు సమర్పించారు. మొదటి దశలో వచ్చిన దరఖాస్తులపై ఆయా పురపాలక, నగరపాలక సంస్థ అధికారులు సర్వే పూర్తి చేశారు. ఇప్పటి వరకు ఈ పథకంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో దరఖాస్తుల పరిశీలన దశలోనే అధికారులు ఆగిపోయారు. ప్రభుత్వం తాజాగా అందరికీ ఇళ్ల పథకం మొదటి దశ అమలుపై పుర గృహనిర్మాణ సంస్థ అధికారులకు స్పష్టత ఇవ్వడంతో లబ్ధిదారుల తుది జాబితాలను ఖరారు చేయడానికి వారు సిద్ధమవుతున్నారు. అందరికీ ఇళ్లు పథకం కింద నివాస స్థలం, ఇంటి నిర్మాణం, రెండు కావాల్సిన వారి నుంచి స్థలం అవసరం లేదు. ఇంటి నిర్మాణం మాత్రమే కావాలన్న వారి నుంచి విడివిడిగా దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు పత్రంలోని సమాచారం ఆధారంగా సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. వారు పూర్తి చేసిన సర్వే వివరాలను సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే వివరాలతో సరిపోల్చి లబ్ధిదారులను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జూలై 31లోగా అందరికీ ఇళ్లు పథకం తొలిదశ లబ్ధిదారులను గుర్తించి ఆ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. అందరికీ ఇళ్లు పథకం రెండోదశ కింద వచ్చిన దరఖాస్తులపై ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించాల్సి ఉంది. రెండో విడత కింద వచ్చిన దరఖాస్తులపై సర్వే వచ్చిన తరువాత ఆ వివరాలను సామాజిక ఆర్థిక, కులగణన వివరాలతో సరిపోల్చి లబ్ధిదారులను గుర్తించాలి. ఈ కార్యక్రమానికి తుది తేదీని ఖరారు చేయలేదు. అందరికీ ఇళ్లు పథకం కింద నెల్లూరు నగరానికి తొలి విడతలో 5వేల ఇళ్లను కేటాయించారు. నెల్లూరు నగరపాలక పరిధిలో స్థలం, ఇల్లు రెండూ కావాలని దరఖాస్తు చేసుకున్న వారు మరికొంత కాలం వేచి ఉండకతప్పదు. ఇల్లు, స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వారి కోసం నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్న ఆమంచర్ల ప్రాంతంలో 30 ఎకరాల స్థలాన్ని సేకరించి ఉన్నట్లు సమాచారం. జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు మొదలుకొని అన్ని వర్గాల నాయకులు, జిల్లా స్థాయి అధికారులు ఆ స్థలంలో ఇళ్లు నిర్మిస్తే అక్కడికి వెళ్లరని చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రత్యామ్నాయంగా కొత్తూరు వద్ద స్థలం చూసినట్లు సమాచారం. ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు స్థలాన్ని ఖరారు చేయకపోవడం వల్ల వీటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మరి కొంత కాలం సొంతింటి కోసం వేచిచూడక తప్పదు. ఇంటి నిర్మాణం కోసం మాత్రమే దరఖాస్తు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1లక్ష మంజూరు చేస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు మంజూరు కాలేదు. అంతేకాకుండా బ్యాంకు ద్వారా 2లక్షల రూపాయల రుణం అందచేస్తారు. లబ్ధిదారుడు సొంతంగా 50 వేల రూపాయలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నివేశ స్థలం, ఇల్లు రెండూ కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి అందచేసే మొత్తంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.