S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చలపతినగర్‌లో వివాహిత హత్య

నెల్లూరు, జూలై 26: అనుమానం పెంచుకున్న భర్త అమానుషంగా మారడంతో ఓ అబల జీవితం బలైపోయింది. తండ్రి లేని ఆ చిన్నారులు చివరకు తల్లిని కూడా కోల్పోయి అనాథలుగా మిగిలారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన మార్తాల సుమలత (26)కు రవీంద్రబాబుతో ఏడేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు. నాలుగేళ్ల కిందట రవీంద్రబాబు చనిపోవడంతో పిల్లలు చిన్నవారు కావడంతో బంధువులు ఆమెను ఒప్పించి రవీంద్ర సోదరుడు శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. మృతురాలి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నారు. కొద్దికాలం అక్కడే ఉన్న ఈ దంపతులిద్దరూ నాలుగు నెలల కిందట సుందరయ్యకాలనీ సమీపంలోని చలపతినగర్‌కు నివాసం వచ్చారు. ఇక్కడకు వచ్చినప్పట్నుంచి సుమలత ప్రవర్తనపై శ్రీకాంత్ అనుమానం పెంచుకున్నాడు. తాను లేని సమయంలో ఆమె ఫోన్‌లో ఇతరులతో మాట్లాడుతోందంటూ తరచూ గొడవలకు దిగేవాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. సుమలత తాను ఇక్కడ ఉండలేనని తల్లిదండ్రుల వద్దకు వచ్చేస్తానని ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అయితే వారు సర్దిచెప్పి తామే అక్కడకు వస్తామని అంతవరకు ఆగమన్నారు. ఈలోగా అదే రోజు సాయంత్రం తన భార్య బాత్‌రూంలో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందంటూ శ్రీకాంత్ కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. చుట్టుపక్కల వారి ద్వారా సుమలత బంధువులకు సమాచారం అందించాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 5వ నగర పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హత్య కేసు నమోదు
తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేశారు. తమ బిడ్డను ఆమె భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని వారు ఆరోపించారు. బాత్‌రూంలో హత్య జరిగిన చోట మృతదేహం కింద పరుపులాంటి వస్త్రం ఉండటం, మృతురాలి ఆత్మహత్యకు ముందు పిల్లలిద్దరినీ శ్రీకాంతే బయటకు పంపించడం అనుమానాలకు తావిస్తున్నాయి. శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.