S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అయ్యా... బిడ్డలు బువ్వ పెట్టడం లేదు

ఆత్మకూరు, జూలై 26: ఇద్దరు కుమారుల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచి పెద్ద చేయగా వారు మాత్రం ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్నా జీవిత చరమాంకానికి చేరుకున్న తల్లిని మాత్రం ఆదరించక నిర్లక్ష్యపరుస్తున్న వ్యవహారంపై ఆత్మకూరు ఎస్సై ఎం పూర్ణచంద్రరావు విచారణ జరుపుతున్నారు. ఆత్మకూరు మండలం బోయల చిరువెళ్ల పంచాయతీ మజరా గొల్లపల్లి గ్రామానికి చెందిన చల్లా వెంకట రమణమ్మ ఇటీవల జిల్లా ఎస్పీ విశాల్ గున్నిని కలసి తన గోడు వెళ్లబోసుకుంది. తన ఇద్దరు కుమారులు నెల్లూరు నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఆస్తులు కూడబెట్టుకున్నారని తెలియజేసింది. వారి తనయులు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఉన్నత స్థితికి చేరుకున్నారన్నారు. అలా స్థితిమంతులైనా తనకు ఆధారంగా ఉన్న నాలుగు ఎకరాలు కూడా బలవంతంగా గుంజుకున్నారని బాధితురాలు వాపోతోంది. తన తదనంతరం ఆ భూమిని వారు స్వీకరించి ఉంటే అప్పటి వరకు జీవన గమనానికి భరోసాగా ఉండేది. అలాగాక ముందుగానే తీసుకుని విక్రయించడంతో ఇప్పుడు నాకు పూట గడవడమే కష్టతరంగా ఉందని, ఆ తల్లి ఆవేదన వెళ్లబోసుకుంది. ఆ ముదుసలి ఆక్రందనకు చలించిన ఎస్పీ గున్నీ ఈ అంశాన్ని పరిష్కరించాలంటూ ఆత్మకూరు పోలీస్ అధికార్లకు ఆదేశించారు. మంగళవారంనాడు ఆత్మకూరు ఎస్సై ఎం పూర్ణచంద్రరావువిచారణకు శ్రీకారం చుట్టారు. మర్నాడు స్టేషన్‌కు వస్తామని కుమారుల ద్వారా సమాచారం అందినట్లు పోలీసులు చెపుతున్నారు. ఇద్దరు బిడ్డల్ని ఆ తల్లిని పెంచి పెద్ద చేసింది. అంతిమప్రాయంలో ఇద్దరు బిడ్డలు కలసి కూడా ఆ ఒక్క తల్లిని మాత్రం ఆదరించలేకున్నారు. బిడ్డలు తల్లిదండ్రుల్ని వృధ్ధాప్యంలో ఆదరించకుంటే కూడా భరణం పొందే హక్కు ఉందని న్యాయశాస్త్రం చెపుతోంది. బిడ్డల ఆర్థిక స్థితి సరిలేకున్నా తప్పక తల్లిదండ్రుల్ని ఆదరించాల్సిందే. అయితే అందుకు భిన్నంగా బిడ్డలు బాగానే స్థితిమంతులైనా ఇలా పోలీసుల పంచాయతీ అనివార్యం కావడం శోచనీయం.
తల్లిదండ్రుల్ని హింసిస్తే చర్యలే: ఆత్మకూరు ఎస్సై పూర్ణచంద్రరావు
తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పోషించకపోగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేయడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడితే ఎవరినీ విడిచిపెట్టబోము. ఇటీవల ఆత్మకూరు వైశ్య బజార్‌కు చెందిన ఓ తల్లిదండ్రుల జంటను కూడా ఆర్థికంగా స్థితిమంతులైన వారి బిడ్డలు ఇలాగే హింసిస్తుంటే తగిన విధంగా చర్యలు తీసుకున్నాము.